What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 26 July 2013

ఏమయ్యా నీ హిందూ మతం లో ఇంతమంది దేముళ్ళ ?? మిగతా మతాలలో ఒక్కడే దేముడు ?? నీ మతం లో ఎవరిని పూజించాలి ???

“ఏకం సత్ విప్రా బహుధావిదంతి” (1 – 164 – 46) అని, “ఏకం సన్తం బహుధా కల్పయన్తి” (10 – 114 – 5) అని ఋగ్వేదం చెప్తోంది. అంటే ఒకే సత్ పదార్థాన్ని పండితులు అనేక విధాల చెప్తున్నారని అర్థం. ఆ ఒకే ఒక్క సత్యపదార్థమే ఓంకారం. హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఆ ఓంకారంలోనే ఉంది. ఆ మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వంలోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు. ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”.

మొదట మీరు వేద సారాన్ని అర్ధం చేసుకోవాలి , వేదాలలో చాల స్పష్టంగా చెప్పేరు, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు నిరాకారుడు ( ఆకారము లేనివాడు ), మహా శక్తీ వంతుడు. అవును భగవంతుడు ఆకారము లేనివాడు అందుకే వివిధ రూపాలలొ ఉంటాడు.
పాము రూపములొ ( నాగేంద్రుడు)
నంది రూపములొ ( నందీశ్వరుడు ).....మొ ||
హిందూ మతం అంటే ప్రకృతిని పూజించే మతం. అంటే  భగవంతుడిని వివిధ ప్రకృతి రూపాలలొ పూజిస్తాము. భగవంతుడు( శక్తీ ) ఒక్కడే .  నీవు ఏ రూపమున పూజించిన ఆ మహా శక్తీ నే పూజిస్థావు . ఆ భగవంతుడు కూడా, భక్తుడి వైన నీ అభీష్టం మేరకే, నీవు పూజించిన రూపములొ నీకు సాక్షాత్కరిస్తాడు.
భగవంతుడు అంటే ఒక మనిషి కాదు, ఒక శక్తీ.
 శక్తీ ని నువ్వు కళ్ళతో చూడలేవు,  సైన్స్ కుడా ఇదే చెపుతోంది. సైన్స్ లో శక్తీ  కి నిర్వచనం
"శక్తీ ని సృష్టించలేము, నాశనము చేయలేము, శక్తీ ఒక రూపములొ అద్రుస్యమయి, మరొక రూపములొ ప్రత్యక్షమవును" ఇది సైన్స్, శక్తీ కి ఇచ్చిన నిర్వచనము.
హిందూ మతం లో, మిగతా మతాల లాగ   ఏదో 2 కర్రల్లో దేముడు ఉన్నాడని చెప్పలేము.
" భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పేదే హిందూ మతం. "
భగవంతుడు మనిషి లో ఉన్నాడు అని చెప్పుతం, అదే వామనావతారం
భగవంతుడు పక్షి లో ఉన్నాడు అని చెపుతాము అదే, గరుడ దేముడు.
గాలి, వాయుదేముడు. ఇలా భగవంతుడు ప్రకృతి అంతా ఆవహించి  ఉన్నాడు. ప్రకృతి లో ఉన్న ప్రతి ప్రాణి లో భగవంతుడు ఉన్నాడు. కేవలం మనిషి లో, మనిషి రూపములో  దేముడు ఉన్నాడు అనటం మూర్ఖత్వమ్.






No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML