హిందువులలో ఉన్న అతిపెద్ద తప్పిదం ఏంటంటే? నాకు నేనే గొప్ప అనుకోవడం,
ఐకమత్యం లేకపోవడం, ఎవరికీ తోచింది వాళ్ళు చెప్పడం, సాటివారిని
పట్టించుకోకపోవం! కష్టంలో ఉన్నప్పుడు తప్ప
గుడి మెట్టు ఎక్కితే ఒట్టు! దేవుడు సుఖంలో గుర్తురాడు! అంత సాదించాను, ఇంత
సాధించాను అని పార్టిలు చేసుకుంటారు కానీ గుడికివెళ్ళి కొబ్బరికాయ కొట్టిన
పాపాన పోరు! ఏదైనా మంచి మాట చెప్తే వితండవాదం మొదలుపెడతారు కానీ అందులో
ఉన్న మంచిని గాలికి వదిలేస్తున్నారు! వాడు మతం మార్చాడు, వీడు మతం మార్చాడు
అని వాళ్ళ మీద పడుతున్నాం కానీ అసలు మనం ఎంతవరకు మన ధర్మాన్ని
రక్షించగలుగుతున్నాం! ఆలోచిస్తున్నారా? ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి
భారదేశాన్ని కించపరచడం, ఏదో దేశం వెళ్లి అక్కడ గొప్పలు, అక్కడి అలవాట్లు
చెప్పుకొని వాటిని ఇక్కడి వారికీ అలవాటు చేస్తున్నారు.. మళ్ళి అక్కడి
వారికీ మాత్రం మన భారతదేశం గురించి చెప్పమంటే నిందించడం ఎక్కువగా
చేస్తున్నారు! మార్పు రావాలి, రావాలి అని కలవరించడం కాదు మీ నుంచి మార్పు
తీసుకురండి!మిమ్మల్ని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు మారతారు! అంటే
కానీ కలవరిస్తే మర్పురాదు!

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment