మహాబలేశ్వర్ దేవాలయం, గోకర్ణం
తప్పక చూడండి
ఉత్తర కన్నడ జిల్లాలో మహాబలేశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ
ఒక శివుడి ఆత్మలింగం ఉండటంచే అది భక్తులలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ
దేవాలయాన్ని కాశీ లేదా వారణాసి దేవాలయాలతో సమంగా భావిస్తారు. పవిత్రమైన ఏడు
ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పూజిస్తారు. మహాబలేశ్వర్ దర్శించుకునే భక్తులు,
అరేబియా సముద్రంలో తప్పక స్నానం చేస్తారు. ఈ నిర్మాణం ద్రవిడ శిల్పకళా
నైపుణ్యతలు కలిగి ఉంది. దేవాలయం తెల్లటి గ్రానైట్ రాళ్ళతో నిర్మాణం
చేశారు.దేవాలయాన్ని చేరిన వెంటనే భక్తులు శివలింగం సాలిగ్రామ పీఠంపై మధ్యలో
ఉండటాన్ని గుర్తిస్తారు. అక్కడ కల ఒక రంధ్రం శివలింగం పై భాగం చూసేందుకు
సౌకర్యం కలిగిస్తుంది. ఈ శివలింగమే కాక దేవాలయంలో సుమారు 1500 సంవత్సరాల
క్రిందటి శివుడి రూపం కూడా ఉంది. హిందువులు తమ పూర్వీకుల కర్మలు చేసేందుకు
కూడా ఈ దేవాలయానికి వస్తారు. లింగాన్ని దర్శించుకుంటే చాలు ఆశీర్వాదం
లభిస్తుందని భావిస్తారు. మహాబలేశ్వర దేవాలయం శివరాత్రి సందర్భంగా వందలాది
భక్తులతో నిండి ఉంటుంది.
తప్పక చూడండి
ఉత్తర కన్నడ జిల్లాలో మహాబలేశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఒక శివుడి ఆత్మలింగం ఉండటంచే అది భక్తులలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని కాశీ లేదా వారణాసి దేవాలయాలతో సమంగా భావిస్తారు. పవిత్రమైన ఏడు ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పూజిస్తారు. మహాబలేశ్వర్ దర్శించుకునే భక్తులు, అరేబియా సముద్రంలో తప్పక స్నానం చేస్తారు. ఈ నిర్మాణం ద్రవిడ శిల్పకళా నైపుణ్యతలు కలిగి ఉంది. దేవాలయం తెల్లటి గ్రానైట్ రాళ్ళతో నిర్మాణం చేశారు.దేవాలయాన్ని చేరిన వెంటనే భక్తులు శివలింగం సాలిగ్రామ పీఠంపై మధ్యలో ఉండటాన్ని గుర్తిస్తారు. అక్కడ కల ఒక రంధ్రం శివలింగం పై భాగం చూసేందుకు సౌకర్యం కలిగిస్తుంది. ఈ శివలింగమే కాక దేవాలయంలో సుమారు 1500 సంవత్సరాల క్రిందటి శివుడి రూపం కూడా ఉంది. హిందువులు తమ పూర్వీకుల కర్మలు చేసేందుకు కూడా ఈ దేవాలయానికి వస్తారు. లింగాన్ని దర్శించుకుంటే చాలు ఆశీర్వాదం లభిస్తుందని భావిస్తారు. మహాబలేశ్వర దేవాలయం శివరాత్రి సందర్భంగా వందలాది భక్తులతో నిండి ఉంటుంది.

No comments:
Post a Comment