What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 24 July 2013

పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి :

పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి :

ఈ కాలంలో మనం బర్త్ డే పార్టీలనీ మనం జరుపుకొంటున్నాము .మన సంప్రదాయం ప్రకారం ఏ విధంగా జరుపుకోవాలీ .

జన్మదినం నాడు కులదేవతలను ఉదయం నిద్ర లేచిన వెంటనే తలుచుకొని స్మరించాలి. ఆ తరువాత గణపతినీ , సూర్య భగవానుని ,ఆ తరువాత మీ ఇష్ట దైవం ని తలుచుకొనీ నమస్కరించు కోవాలీ . పుట్టినరోజు నాడు షేవింగ్ ,గోళ్లు తీయడం ,కలహం ,ప్రయాణం ,హింస విడిచి పెట్టాలి .

మన శాస్త్రం పుట్టినరోజున ఎమీ చేయలని చెపుతోందో చూద్దాం :

ప్రతి జన్మనక్షత్రంమందు ,పుట్టిన రోజు (తిధి )నందు అపమృత్యు పరిహారం కోసం ఆయుష్య సూక్తం తో హోమం చేయలీ .ఈ హోమం అ మనిషికి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది .వ్యాధులు రాకుండా పరిహరాన్ని ఇస్తుంది . ఇంద్ర, రుద్రాద్రి ,దేవతలుకు చేసే ప్రార్థనలు వారికీ సకల శుభాలనూ ఇస్తాయి .

అరోజు చేసే దానాలు వారికి పుణ్యం ఇవ్వడం కాకుండా మన కన్నా తక్కువ స్థితిలో ఉన్నవారికి సహాయం చెసామన్న తృప్తి నీ కలిగిస్తాయి.

పుట్టిన రోజు నా రుద్రాభిషేకం ఇంటిలో అయిన ,ఆలయం లో అయిన చేయడం మంచిది .

తీరిక ఉంటె లలితసహస్రనామం ,విష్ణుసహస్రనామం పారాయణము చేయవచ్చు .

ఇంతే కాకుండా గ్రహచరాదులు వలన అపమృత్యు దోషం ప్రాప్తి అయినపుడు మృత్యుంజయ హోమం శ్రేయస్సుని ఇస్తుంది.

ఉదయన్నే నువ్వుల నునెతో తలంటుకొని తల స్నానం చేసి ,నూతన వస్త్రధారణ ,రక్షా తిలకం ధరించడం ,ఇంటిలో గల పూజ గది లో దేవుళ్ళకి హారతి ఇచ్చి ,ఆ హారతిని గ్రహించటం, ఇవీ ప్రధానమయనవి. ఇవి అరిష్టాలని పోగొడతాయి.

పసిపిల్లలకి ఒక ఏడాది పూర్తి అయ్యేవరకు ప్రతి మాసం లో జన్మ తిథి నాడు జన్మదినము చేయాలి .అ తరువాత ప్రతి ఏడది జన్మతిథి నాడు జన్మ దినం జరపాలి .ఇదీ మన సంప్రదాయం

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML