What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Showing posts with label ధర్మ సందేహములు. Show all posts
Showing posts with label ధర్మ సందేహములు. Show all posts

Tuesday, 7 April 2015

జ్యేష్టునికే రాజ్యాధికారం అన్నది న్యాయ సమ్మతమయితే, పాండు రాజుకులేని రాజ్యాధికారం పాండవులకు ఏవిధంగా సంక్రమిస్తుంది.?

ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగుట చేత రాజ్యాధికారి కాదని. కురువంశమునకు రాజుకాదగిన సమర్ధుడయిన కుమారుని తన కోడలికి అనుగ్రహింపమని సత్యవతి వ్యాసమహర్షిని కోరెను. అంతటి వ్యాసుడు పాండురాజును అనుగ్రహించెను. కనులులేని కారణంగా ధృతరాష్ట్రునికి రాజ్యార్హత కాకపోయినది. విదురుడు దాసీపుత్రుడు కనుక విదురునికి రాజ్యధికారములేకపోయినది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని విదురుడు దాసీ పుత్రుడు అని మనకు తెలిసిన విషయమే కదా! "మనుస్మృతి" యాజ్ఞ వల్క్యనిస్మృతి వంటి ధర్మశాస్త్ర గ్రంధాల ఆధారంగా రాజ్యాధికారం నేత్రాహీనుడయిన ధృతరాష్టునకు లేదు. పాండురాజు పరిపాలనా విశేషములు మహభారతంలో వివరింపబడినవి. ఆంధ్రామహాభారతం అదిపత్యం షష్ఠశ్వాసంలో కూడా 123, 124, 128, 129, 143 పద్యాలలో ధర్మరాజు- రాజు అవ్వవలసిన ఆవశ్యకత విషయంగా ధృతరాష్ర్టుడు దుర్యోధనునికి చెప్పిన విషయము, పౌరులు అందరు చర్చించుకున్న విషయం వున్నవి. ఒకసారి పాండురాజు అయినప్పుడు అతని కుమారుడే రాజు కావలెను అనే విషయం ధృతరాష్ట్రుడు దుర్యోధనునినో అన్న సందర్భాలువున్నాయి. కేవలం గుడ్డివాడుగా రాజార్హత కోల్పోయిన ధృతరాష్ట్రుడు పాండురాజు వానప్రస్ధంకు వెళ్ళగా అత్యవసరస్ధితిలో రాజ్యాధికారం తీసుకొని భీష్ముని రక్షణలో పాలన చేశాడు.వేరే ఆధారం లేనిసమయంలో యిచ్చిన రాజ్యాధికారం- అది విలువయినది కాదు. పాండురాజు రాజ్యంలో లేని కారణంగా అతని రాజ్యానికి రక్షణ నిమితం ప్రతినిధిగా ధృతరాష్ట్రుడు వున్నారు. అంతేకాని పూర్తి రాజరిక లక్షణాలతో రాజ్యాధికారి కాలేదు. అందువలన పూర్తిరాజు లక్షణాలు వున్న పాండురాజే రాజు. అతని పుత్రులు పాండవులే రాజ్యాధికారులు. యిది ధర్మశాస్త్ర విషయము.
Read More

గాంధారి భర్తను అనుసరించి అంధురాలు అయింది. అది పతివ్రతా ధర్మమా లేక ఆమె కూడా పుత్ర వ్యామోహంలో చిక్కుకున్నదా?

తన వివాహం ధృతరాష్ట్రునితో జరగనున్నదని సుబలుని బంధువుల మాటలు విన్నగాంధారి- నాకు భర్త ధృతరాష్ర్ట మహారాజే- అన్యులను వివాహమాడ అంగీకరించను. అని ఆ మహాపతివ్రత పరపురుషులను తాను చూచుటకు యిష్టపడక "భర్తకు కళ్ళు లేవు" కావున తానుకూడా కళ్ళకు గుడ్డ అడ్డం కటుకొన్నది. అదేవిధంగా జీవితాంతం భర్తతోపాటు అంధురాలిగానే గడిపినది. అయితే ఈమె కూడా ధృతరాష్ట్రుని మాదిరిగానే పాండవుల విషయంలో- పుత్రవ్యామోహంతో అంధురాలివలెనే ప్రవర్తించినది. కుంతికి ధర్మరాజు కలిగాడని తెలిసి గర్భవతిగా వున్న గాంధారి తన గర్భమును బాదుకొని గర్భాస్రావం చేసుకొన్నది. అయితే వ్యాసమహర్షి దయ వలన ఆమెకు ఆ పిండరక్షణ కలిగి దుర్యోధనాదులు ఉద్భవించారు. ఈ విధంగా పాండవుల ఉత్పత్తి నాటినుండే తన అసూయ ప్రకటించి ప్రవర్తనా విషయంగా అంధరాలయినది.
Read More

శ్రీమంతులు కావాలంటే.. శివలింగాన్ని పూజించండి?

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు.

2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.

6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.

7. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది.
Read More

Monday, 6 April 2015

హనుమంతుని అవతారములలో


Read More

గ్రహ దోషాలు పోగొట్టుటకు దర్భలు ఎందుకు ??


Read More

రాహు గ్రస్త చంద్ర గ్రహణం : గ్రహణ సమయములో క్రూర జంతువులు కూడా ఆహారం ముట్టుకోవు


Read More

గ్రహణ సమయములో ఆచరించ వలసినవి


Read More

విగ్రహారాధనలో అంతరార్థం!



విగ్రహారాధనలో అంతరార్థం!

ఉత్తమం సహజావస్థా ద్వితీయం ధ్యానధారణా
తృతీయాప్రతిమా పూజా హోమయాత్రాచతుర్థికా – శివపురాణం


అంటే, భగవంతుని తనలో ప్రత్యక్షం (ఆత్మదర్శనం)చేసుకోవడం ఉత్తమమయినది. భగవంతుని గురించిన జ్ఞానము, ధారణ దాని తరువాతవి. మూడవది భగవంతుని ప్రతిమలను పూజించడం. నాలుగవది పుణ్యక్షేత్రాలను దర్శించడం. చివరి రెండూ సామాన్య భక్తుల కోసం ఉద్దేశించినవి. పరామాత్మ అనుగ్రహం పొందడానికి విగ్రహారాధన ఒక మెట్టు వంటిది
Read More

గణపతి ఆలయ ప్రదక్షిణ ఫలితం.....



గణపతి ఆలయ ప్రదక్షిణ ఫలితం.....

సాధారణంగా పూజామందిరాల్లోను ... ఆలయాలలోను గణపతి తప్పనిసరిగా దర్శనమిస్తూ వుంటాడు. విద్య .. ఉద్యోగం .. వివాహం .. వ్యాపారం .. ఇలా దేనిలో అనుకున్న ఫలితాలను పొందాలన్నా అందుకు అడ్డుపడుతోన్న ఆటంకాలు తొలగిపోవాలి. అలాంటి ఆటంకాలు తొలగించే దైవంగా వినాయకుడు కనిపిస్తుంటాడు. అందుకే ప్రతిఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తూ వుంటారు.

అనునిత్యం ఇంటి దగ్గరే ఆ స్వామికి పూజాభిషేకాలు జరిపేవారు వున్నారు. అనుదినం ఆయన ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తరువాతనే దైనందిన కార్యక్రమాలు ఆరంభించేవాళ్లూ వున్నారు. వినాయకుడి ఆశీస్సులతోనే ... అనుమతితోనే వాళ్లు ప్రతీకార్యాన్ని ప్రారంభిస్తుంటారు. ఇందువలన తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని విశ్వసిస్తుంటారు.


ఇలా వినాయకుడిని పూజించడం వలన కార్యాలు సఫలీకృతం కావడమే కాకుండా, గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పబడుతోంది. వినాయకుడికి ప్రదక్షిణలు చేయడం వలన, కేతుగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. కేతుగ్రహ దోషం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అభివృద్ధిపరంగా అడుగుముందుకు పడకపోవడం ... అందుకు సంబంధించి చేసే పనుల్లో అవమానాలు ఎదురుకావడం జరుగుతూ వుంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో గణపతిని అంకితభావంతో పూజించడం వలన, కేతువు శాంతిస్తాడని చెప్పబడుతోంది. ఎందుకంటే కేతు గ్రహానికి అధిష్ఠాన దేవతగా 'గణపతి' వ్యవహరిస్తుంటాడు. అందువలన కేతుగ్రహ సంబంధమైన దోషంతో బాధలుపడేవాళ్లు, గణపతికి ప్రదక్షిణలు చేస్తూ .. పూజలు చేస్తూ సేవించడం వలన ఆశించిన ఫలితం అందుతుందని స్పష్టం చేయబడుతోంది
Read More

మీరు కొనే వస్తువులు మంచివా లేక నకిలీవా అని తెలుసుకోవడం చాలా అవసరం.. మీరు కొనే వస్తువులు ఏ దేశానివో తెలుసుకుని కొనడానికి ఉపయోగపడే బార్ కోడ్స్ ఇవి..........ప్రతి ఒక్కరూ నోట్ చేసుకుని మోసపోకుండా మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోండి........విజయ.కె.

మీరు కొనే వస్తువులు మంచివా లేక నకిలీవా అని తెలుసుకోవడం చాలా అవసరం..
మీరు కొనే వస్తువులు ఏ దేశానివో తెలుసుకుని కొనడానికి ఉపయోగపడే
బార్ కోడ్స్ ఇవి..........ప్రతి ఒక్కరూ నోట్ చేసుకుని మోసపోకుండా మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోండి........విజయ.కె.
00-13: USA & Canada
20-29: In-Store Functions
30-37: France
40-44: Germany
45: Japan (also 49)
46: Russian Federation
471: Taiwan
474: Estonia
475: Latvia
477: Lithuania
479: Sri Lanka
480: Philippines
482: Ukraine
484: Moldova
485: Armenia
486: Georgia
487: Kazakhstan
489: Hong Kong
49: Japan (JAN-13)
50: United Kingdom
520: Greece
528: Lebanon
529: Cyprus
531: Macedonia
535: Malta
539: Ireland
54: Belgium & Luxembourg
560: Portugal
569: Iceland
57: Denmark
590: Poland
594: Romania
599: Hungary
600 & 601: South Africa
609: Mauritius
611: Morocco
613: Algeria
619: Tunisia
622: Egypt
625: Jordan
626: Iran
64: Finland
690-692: China
70: Norway
729: Israel
73: Sweden
740: Guatemala
741: El Salvador
742: Honduras
743: Nicaragua
744: Costa Rica
746: Dominican Republic
750: Mexico
759: Venezuela
76: Switzerland
770: Colombia
773: Uruguay
775: Peru
777: Bolivia
779: Argentina
780: Chile
784: Paraguay
785: Peru
786: Ecuador
789: Brazil
80 – 83: Italy
84: Spain
850: Cuba
858: Slovakia
859: Czech Republic
860: Yugoslavia
869: Turkey
87: Netherlands
880: South Korea
885: Thailand
888: Singapore
890: India
893: Vietnam
899: Indonesia
90 & 91: Austria
93: Australia
94: New Zealand
955: Malaysia
977: International Standard Serial Number for Periodicals (ISSN)
978: International Standard Book Numbering (ISBN)
979: International Standard Music Number (ISMN)
980: Refund receipts
981 & 982: Common Currency Coupons




Read More

Thursday, 2 April 2015

గణపతి ఆలయ ప్రదక్షిణ ఫలితం.....



గణపతి ఆలయ ప్రదక్షిణ ఫలితం.....

సాధారణంగా పూజామందిరాల్లోను ... ఆలయాలలోను గణపతి తప్పనిసరిగా దర్శనమిస్తూ వుంటాడు. విద్య .. ఉద్యోగం .. వివాహం .. వ్యాపారం .. ఇలా దేనిలో అనుకున్న ఫలితాలను పొందాలన్నా అందుకు అడ్డుపడుతోన్న ఆటంకాలు తొలగిపోవాలి. అలాంటి ఆటంకాలు తొలగించే దైవంగా వినాయకుడు కనిపిస్తుంటాడు. అందుకే ప్రతిఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తూ వుంటారు.

అనునిత్యం ఇంటి దగ్గరే ఆ స్వామికి పూజాభిషేకాలు జరిపేవారు వున్నారు. అనుదినం ఆయన ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తరువాతనే దైనందిన కార్యక్రమాలు ఆరంభించేవాళ్లూ వున్నారు. వినాయకుడి ఆశీస్సులతోనే ... అనుమతితోనే వాళ్లు ప్రతీకార్యాన్ని ప్రారంభిస్తుంటారు. ఇందువలన తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని విశ్వసిస్తుంటారు.


ఇలా వినాయకుడిని పూజించడం వలన కార్యాలు సఫలీకృతం కావడమే కాకుండా, గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పబడుతోంది. వినాయకుడికి ప్రదక్షిణలు చేయడం వలన, కేతుగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. కేతుగ్రహ దోషం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అభివృద్ధిపరంగా అడుగుముందుకు పడకపోవడం ... అందుకు సంబంధించి చేసే పనుల్లో అవమానాలు ఎదురుకావడం జరుగుతూ వుంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో గణపతిని అంకితభావంతో పూజించడం వలన, కేతువు శాంతిస్తాడని చెప్పబడుతోంది. ఎందుకంటే కేతు గ్రహానికి అధిష్ఠాన దేవతగా 'గణపతి' వ్యవహరిస్తుంటాడు. అందువలన కేతుగ్రహ సంబంధమైన దోషంతో బాధలుపడేవాళ్లు, గణపతికి ప్రదక్షిణలు చేస్తూ .. పూజలు చేస్తూ సేవించడం వలన ఆశించిన ఫలితం అందుతుందని స్పష్టం చేయబడుతోంది
Read More

చైత్ర పూర్ణిమకు సంపూర్ణ చంద్ర గ్రహణం(శనివారం 4 ఏప్రిల్ 2015)



చైత్ర పూర్ణిమకు సంపూర్ణ చంద్ర గ్రహణం(శనివారం 4 ఏప్రిల్ 2015)

శ్రీ మన్మథ నామ సంవత్సర చైత్ర పూర్ణిమ శనివారం 4 ఏప్రిల్ 2015 హస్త నక్షత్ర కన్యా రాశిలో సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించును. భారతదేశంలో మాత్రం సంపూర్ణం కనపడదు. గ్రహణం సంపూర్ణం జరిగిన తర్వాత చివరి విడుపు భాగం మాత్రమే పాక్షికంగా భారతదేశంలో కనపడును. 5 నిముషాలపాటు నిలకడగా సంపూర్ణ చంద్రగ్రహణ బింబము నిలబడును. ఆస్ట్రేలియా, అమెరికాలలో సంపూర్ణ గ్రహణము గోచరించును.

భారత కాలమాన ప్రకారం చంద్రగ్రహణ సమయాలు
పాక్షికంతో చంద్రగ్రహణ స్పర్శ - మ 3.46 నిముషాలు
సంపూర్ణ స్థితికి గ్రహణము రాక (ఉన్మీలనము) - సా 5.28 నిముషాలు
సంపూర్ణ స్థితి నుంచి విడుపు ప్రారంభం (నిమీలనము) - సా 5.33 నిముషాలు
పాక్షికంతో గ్రహణం ముగింపు (మోక్షం) - రా 7.15 నిముషాలు
పూర్తి గ్రహణ కాలము - 3గం. 29నిముషాలు
సంపూర్ణ గ్రహణ బింబ సమయము - 5 నిముషాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో పాక్షిక గ్రహణం వివిధ ప్రాంతాలలో కనపడే సమయాలు
ఇచ్చాపురం - సా 6.07 నుంచి 7.15 వరకు 68 నిముషాలు
శ్రీకాకుళం - సా 6.10 నుంచి 7.15 వరకు 65 నిముషాలు
విజయనగరం, వైజాగ్ - సా 6.12 నుంచి 7.15 వరకు 63 నిముషాలు
కాకినాడ - సా 6.16 నుంచి 7.15 వరకు 59 నిముషాలు
అమలాపురం - సా 6.17 నుంచి 7.15 వరకు 58 నిముషాలు
రాజమండ్రి - సా 6.18 నుంచి 7.15 వరకు 57 నిముషాలు
ఏలూరు - సా 6.21 నుంచి 7.15 వరకు 54 నిముషాలు
తిరుపతి, చిత్తూరు - సా 6.27 నుంచి 7.15 వరకు 53 నిముషాలు
అనంతపురం - సా 6.35 నుంచి 7.15 వరకు 50 నిముషాలు
కడప - సా 6.29 నుంచి 7.15 వరకు 46 నిముషాలు
కర్నూలు, శ్రీశైలం - సా 6.31 నుంచి 7.15 వరకు 44 నిముషాలు
హైదరాబాదు - సా 6.32 నుంచి 7.15 వరకు 43 నిముషాలు
వరంగల్ - సా 6.28 నుంచి 7.15 వరకు 47 నిముషాలు
కరీంనగర్ - సా 6.30 నుంచి 7.15 వరకు 45 నిముషాలు
మెదక్ - సా 6.33 నుంచి 7.15 వరకు 42 నిముషాలు
ఖమ్మం, తిరుత్తణి - సా 6.25 నుంచి 7.15 వరకు 50 నిముషాలు
నెల్లూరు, ఒంగోలు - సా 6.25 నుంచి 7.15 వరకు 50 నిముషాలు
ఆదిలాబాద్, నిజామాబాద్ - సా 6.33 నుంచి 7.15 వరకు 42 నిముషాలు
మహబూబ్ నగర్ - సా 6.34 నుంచి 7.15 వరకు 41 నిముషాలు

ఇతర ముఖ్య ప్రాంతాలలో గోచరించు సమయాలు
షిర్డీ - సా 6.50 నుంచి 7.15 వరకు 25 నిముషాలు
పూరి - సా 6.03 నుంచి 7.15 వరకు 72 నిముషాలు
కలకత్తా - సా 5.54 నుంచి 7.15 వరకు 81 నిముషాలు
అహ్మదాబాద్ - సా 6.59 నుంచి 7.15 వరకు 16 నిముషాలు
మదురై - సా 6.30 నుంచి 7.15 వరకు 45 నిముషాలు
త్రివేండ్రం - సా 6.35 నుంచి 7.15 వరకు 40 నిముషాలు
మైసూరు - సా 6.37 నుంచి 7.15 వరకు 38 నిముషాలు
మద్రాస్, గుంటూరు - సా 6.22 నుంచి 7.15 వరకు 53 నిముషాలు
విజయవాడ, భద్రాచలం - సా 6.22 నుంచి 7.15 వరకు 53 నిముషాలు
బెంగళూరు - సా 6.34 నుంచి 7.15 వరకు 41 నిముషాలు
ఢిల్లీ - సా 6.43 నుంచి 7.15 వరకు 32 నిముషాలు

భారతదేశంలో కనపడే ఈ పాక్షిక గ్రహణము గర్భవతులు చూడవద్దు. తమ తమ పనులను చక్కగా ఆచరించవచ్చు. మల, మూత్ర విసర్జనములకు వెళ్ళవచ్చును. గ్రహణ కిరణములు సోకకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది.
Read More

Saturday, 28 March 2015

పూజలు, పునస్కారాలు చేయడానికి మాకు సమయం ఎక్కడుంది?

పూజలు, పునస్కారాలు చేయడానికి మాకు సమయం ఎక్కడుంది? పొద్దున్నే పనికి వెళ్ళి ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకునే మేము పూజలు ఎలా చేయగలం?" అనే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇందుకు సమాధానం శ్రీ కృష్ణ పరమాత్మే చెప్పాడు" ప్రతి మనిషీ ఎదో ఒక పని చెయ్యక తప్పదు. ప్రతి కర్మకు దైవం ఒక కారణంగా ఉంటాడు". ఆయన మాట ప్రకారం చేస్తున్న పనులనే భగవంతుని ఆరాధించడంగా భావించి తరించిన భక్తులెందరో ఉన్నారు. కబీర్ వంశవృత్తి నేతనేయడం. నేత పనిలో నిమగ్నమైనప్పుడు కూడా కబీర్ మనసు భగవంతునియందే నిమగ్నమై ఉండేది. గోరా అనే కుమ్మరి ఎప్పుడూ పాండురంగని నామాన్ని జపిస్తూ, కుండలుచేసేవాడు. శివభక్తుడైన నందనార్ కొద్దిమంది బాలుర సాయంతో చెరువును తవ్వడం మొదలుపెట్టాడు. అంతే చూస్తుండగానే వందలాది శివగణాలే కూలీల రూపంలో వచ్చి, ఆ పనిని శీఘ్రతిన ముగించేసారు.
మనం అసలు నిత్యం ఆ పరమాత్మ స్మరించుకుంటు , మనం చేసే ప్రతి పనిని ఆయనకు సమర్పించుకుంటూ, ధార్మికంగా జీవితాన్ని గడపటమే పెద్ద పూజ! అసలు నిత్యం నామస్మరణ చేసుకుంటే..అదే భక్తి మార్గం..ముక్తికి ద్వారం....మోక్షానికి కారణం!
ఓం నమో భగవతే వాసుదేవాయా!
Read More

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?



లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అనేది ఒక మూఢనమ్మకంగా ఏర్పడిందే కానీ ప్రామాణిక గ్రంథాలలో యే దేవతామూర్తిని యేవిధంగా అర్చించాలి అనే విశేషాంశాన్ని పరిశీలిస్తే మటుకు పాదాలనే పూజించాలి అంటాయి ఆ గ్రంథాలన్నీ కూడా. విశేషించి పాదాలే పూజచేయడం శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించే సమయంలో మనం గమనిస్తూంటాం. అన్నమాచార్యులవారు బ్రహ్మకడిగిన పాదము అని చెప్పారు కదా! అలాగే బలిచక్రవర్తి కూడా వామనుని పాదాలను జలముతో తన భార్యయైన వింధ్యావళి నీళ్ళు పోస్తుండగా కడిగి ఆ స్వామి అడిగిన మూడు అడుగుల నేలను దానం ఇవ్వగా ఆస్వామి పాదాలతో పృథివ్యాపస్తేజోవాయురాకాశములు అయిన పంచభూతాత్మకమైన ప్రపంచాన్నంతటినీ కూడా ఈపాదంతో ఆక్రమించాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా తానుగా దర్శింపజేసి ఆ మూడవపాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచాడు. కాబట్టి మనము భగవంతుని పాదములను ఆశ్రయించాలి. "భగవంతు వలగొను పదములు పదములు" అంటారు పోతనామాత్యులు. కనుక శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో పాదములను ఆశ్రయించాలి. అమ్మవారికి మాత్రం పాదములకు పూజించరాదు అనే ఒక కొత్తగా కనుక్కున్నారు. నిజానికి పరమేశ్వరి - పరమేశ్వరుడు, లక్ష్మీదేవి - శ్రీమన్నారాయణుడు, అంతా ఒక్కటే. కాబట్టి ఎటువంటి అనుమానమూ లేకుండా అమ్మవారి పాదములు అర్చించవచ్చును. కొల్హాపురంలో అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్ళినా మరింకే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు శఠారిని మన శిరస్సుపైన ఉంచుతాడు. మనం తలవంచి నమస్కారం చేస్తాం. ఆ శఠారి (శఠం అంటే మనలో ఉండే మొండితనం - దానిని తొలగించేవి పరమాత్ముని యొక్క పాదములు. దానిమీద పరమాత్మ పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్ళి ఆ అమ్మవారికి నమస్కరించిన తరువాత అర్చకులు మనశిరస్సుపై ఉంచే శఠారి పైన అమ్మవారి పాదాలే ఉంటాయి. ఇది గమనించాలి. పాదపూజ అని చెప్తాం. పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఆయనను మనం దర్శించగలిగే స్థితి ఎక్కడ? అంటే పాదములను దర్శిస్తే చాలు పరమాత్మను దర్శించినట్లే. ఇటువంటి భావంతో అయ్యవారికైనా, అమ్మవారికైనా సర్వాంములు నమస్కరించవలసిందే. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఒక్కసారి పరిశీలించినా చంచలాయై నమః - పాదౌపూజయామి, ఇలా సర్వాంగాలనూ పూజ చేస్తాం కదా! మరి పాదాలు పూజ చేయకుండా ఎలా? మొట్టమొదటి నామమే చంచలాయై నమః - పాదౌపూజయామి. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పాదములను తప్పకుండా పూజించవచ్చు.
Read More

గుడి లో ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు


Read More

ప్రభాత కాలంలో దేవతలను స్మరించి ప్రస్తుతించాలని వేదమాత చెపుతోంది.

ప్రభాత కాలంలో దేవతలను స్మరించి ప్రస్తుతించాలని వేదమాత చెపుతోంది. దేవతలను స్మరించడం వల్ల , ప్రస్తుతించడం వల్ల దైవశక్తులను పొంది దైవీగుణ సంపన్నులు కావచ్చు.నిండుమనస్సుతో దైవాన్ని స్మరించేవాడు దైవసన్నిధిని చేరతాడని, దైవీశక్తులను ఆకర్షిస్తాడని, శక్తిమంతుడౌతాడని, జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ధైర్యస్తైర్యాలతో సహించి, సంతోషంతో ముందుకు సాగుతాడని ఋగ్వేదం చెబుతోంది. పవిత్రభావనస్మరణంతో పరమేశ్వర సాహచర్యాన్ని పొందవచ్చు. వేకువసమయంలో చేసే భగ్వత్స్మరణ ధ్యానాలు ఎంతో ప్రసన్నంగా ఉంటాయి. పరమేశ్వర స్మరణవల్ల ఆత్మ విశ్వాసం ప్రబలుతుంది. ప్రాతః స్మరణకు అనువైన శ్లోకాలు, పద్యాలు, దండకాలు, పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిని పాడుకొంటూ భావాన్ని మననం చేస్తూ ఉండాలి. ప్రహ్లాద, నారద , అంబరీష, విభీషణాది పరమభక్తులను స్మరించడంవల్ల భగవత్భక్తి ప్రబలుతుంది. ధర్మరాజును కీర్తించడంవల్ల ధర్మం వృద్ధి అవుతుంది. భీమసేనుని స్మరించడంవల్ల పాపసమ్హారం అవుతుంది. అర్జునుని కీర్యించ్డం వల్ల శత్రువులు నశిస్తారు. నకులసహదేవులను తలచడంవల్ల రోగాలు పోతాయి. ఈ విధంగా పరమ శివుని, రాముని, కృష్ణుని , ఆంజనేయుని....ఇలా ఏదేవతయైనా స్మరించవచ్చు. శుభములను పొందవచ్చు.
Read More

విఘ్నేశ్వరుడికి ఎందుకు గరిక తో ఎక్కువ పూజ చేస్తారు


Read More

Tuesday, 24 March 2015

రామ సంబంధమైన పండుగలు ఏడాదిలో శ్రీరామనవమి కాక మరి రెండు ఉన్నాయి.



రామ సంబంధమైన పండుగలు ఏడాదిలో శ్రీరామనవమి కాక మరి రెండు ఉన్నాయి.

1. రామలక్ష్మణ ద్వాదశి: ఇది జ్యేష్ఠ శుద్ద ద్వాదశి నాడు జరుపుకుంటాం.
2. జానకీ జయంతి: ఇది ఫాల్గుణ శుద్ద అష్టమి నాడు జరుపుకుంటాం.
జనకమహారాజు యజ్ఞశాలకై భూమిని దున్నుతూ ఉండగా నాగటి చాలులో తగిలిన బంగారు పెట్టెలో ఈ నాడు సీత దొరికింది. అందుచేత ఈనాడు సీతాజయంతిగా జరుపుకుంటాము.
Read More

లక్ష్మీ పంచమి ప్రత్యేకత



లక్ష్మీ పంచమి ప్రత్యేకత
ఆర్ధికపరమైన బలం ఆనందాన్నిస్తుంది ... అవసరాలు తీర్చుకోగలం, ఆపదల నుంచి గట్టెక్కగలం అనే ధైర్యాన్నిస్తుంది. ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంపదలను పెంచుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి చల్లనిచూపు సోకితే సిరిసంపదలతో తులతూగడానికి ఎంతో సమయం పట్టదు.

అలాంటి లక్ష్మీదేవిని 'చైత్రశుద్ధ పంచమి' రోజున పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరాన్ని వివిధ రకాల పూలమాలికలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం జరపాలి. దమనములతో అమ్మవారిని అర్చిస్తూ, ఆమెకి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.


ఈ విధమైన నియమనిష్ఠలతో పూజించడం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇదే రోజున నాగదేవతను కూడా ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నాగప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహించి పాలను నైవేద్యంగా సమర్పించాలి.

సాధారణంగా కొందరిని నాగదోషాలు వెంటాడుతూ ఉంటాయి. ఫలితంగా ప్రతి విషయంలోనూ ఎన్నో ఉబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకు కారణం నాగదోషం అనే విషయం కూడా చాలామందికి తెలియదు. నానారకాల సమస్యలతో సతమతమైపోతున్న వాళ్లు ఈ రోజున నాగదేవతను పూజించడం వలన నాగదోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.

వల్లూరి పవన్ కుమార్
Read More

Sunday, 22 March 2015

ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్ర సూత్రాలు



ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్ర సూత్రాలు (అమ్మ లక్ష్మి గారు)

స్థల శుద్ధి లేనప్పుడు గృహ నిర్మాణం పనికిరాదు. స్థలం ఎన్నుకోవడంలో నేర్పు వుంటే గృహ నిర్మాణం తీరుగా వుంటుంది. స్థలానికి సమకోణంలో వీధి దూసుకుపోతే వీధి శూల వున్నట్లు అర్థం. అంటే వేరే వీధి వచ్చి గృహ గర్భంలో తగిలితే "గర్భశూల" అంటారు. వీధి స్థలంలోని ఇంటి నుండి దూసుకుని వెళితే "వీధిశూల" అని గుర్తించాలి.

తూర్పు వీధిశూల వల్ల రాజభయం. ఆగ్నేయం అయితే అగ్ని భయం, చోర భయం కూడా కలుగుతాయి. దక్షిణం అయితే రోగాలు, చావులు. పాము పుట్ట వున్న స్థలం కొని పుట్ట త్రవ్వి తీసివేసుకోవచ్చులే అని అనుకోకూడదు. అలా చేస్తే తర తరాలుగా నాగ భయం పీడిస్తుంది. నాగ దోషం కారణంగా సంతాన నష్టం, పిల్లల అకాల మరణం వంటివి సంభవిస్తాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.


దేవాలయ ఆవరణంలోని స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదు. అలా చేస్తే తరతరాలు ఏ పని మొదలు పెట్టినా అపజయమే సిద్ధిస్తుంది. క్రమంగా వంశ నాశనం కూడా కలుగుతుంది. దేవతా విగ్రహాలు ఏ స్థలంలో దొరుకుతాయో ఆ స్థలాన్నికొని, గృహ నిర్మాణం చేయకూడదు. దేవతా శాపం వల్ల వివాహాలు కావు, మంత్రజపాలు బెడిసి కొడుతాయి.

మామిడిచెట్లు, పాలుగారే చెట్లు, కొబ్బరి చెట్లు నరికివేసి గృహాన్ని నిర్మించుకోవలసి వస్తే, ఆ స్థలాన్ని వాడుకోరాదు. అలాంటిచోట నివసించే స్త్రీలు నిండు యవ్వనంలోనే మరణిస్తారు. ఇంటి గర్భంలో ఆస్పత్రి, కబేళా, చర్మ పరిశ్రమలు దూసుకువచ్చేలా వున్న స్థలాన్ని నివాస గృహ నిర్మాణానికి ఎంపిక చేయకూడదని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు
Read More

Powered By Blogger | Template Created By Lord HTML