అమరత్వం..
శ్రీరమణతత్వం..
పొణ్ణమ్మకు ఆచరించి చూపించిన రమణులు
భగవాన్ రమణ మహర్షి తన శిష్యులందరినీ సమానంగా చూసేవారు. ఆయన జీవించి ఉన్నంత వరకూ ఉన్నతోద్యోగులకు, సంపన్నులకు, వ్యాపారవేత్తలకు పెద్ద పీట వేయడం, మిగిలినవారిని ఉదాసీనంగా చూడడం ఉండేది కాదు. ఆయన రోజూ ఉదయం ఒక గంట సేపు భక్తులు, శిష్యులతో గడిపేవారు. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునేవారు. వారి సందేహాలను తీర్చేవారు. కానీ, 'నిన్ను నీవు తెలుసుకో' అనే వాక్యం మాత్రం ఆయన నుంచి తప్పకుండా వచ్చేది. భక్తులు, శిష్యుల సమస్యలకు ఆయన అతి తేలికైన పరిష్కార మార్గాలు చూపించేవారు.
పొణ్ణమ్మ అనే ఆమె ఆశ్రమానికి ఆకుకూరలు తెచ్చేది. ఇంటింటికీ తిరిగి ఆకుకూరలు అమ్మడం ఆమెకు జీవనంగా ఉండేది. అయితే, భర్త అకస్మాత్తుగా మరణించడంతో కుమారుడిని మందలించేవారే లేకుండాపోయారు. అతను బడికి వెళ్లేవాడు, బాగా చదివేవాడు. కానీ, అతనికో చెడు అలవాటు ఉండేది. దాన్ని మాన్పడం ఆమెకు సాధ్యం కాలేదు. ఇంట్లో బెల్లం, పంచదార కనిపిస్తే తినేసేవాడు. ఎంత చెప్పినా వినేవాడు కాదు. స్వామితో చెప్పిస్తే, 'ఆయన వాక్ మహిమ వల్లయినా వింటాడేమో' అనే అభిప్రాయం ఆమెకు కలుగుతుండేది. భక్తులతో ఇష్టాగోష్టి పూర్తయిన తరువాత రమణులు విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. పెద్ద తలగడ మీద చెయ్యి ఆనించి, తలకు మరో ఆలంబనం కల్పించుకుని ఆయన ఓ వింత భంగిమలో విశ్రాంతి తీసుకొంటుండేవారు. ఇటువంటి పరిస్థితిలో ఒకసారి పొణ్ణమ్మ ధైర్యం చేసి రమణుల వద్దకు వెళ్లి, నమస్కరించింది. "ఏం పొణ్ణమ్మా, ఎలా ఉన్నావు'' అని ఆయన అనునయంగా అడిగారు. "బాగానే ఉన్నాను స్వామీ'' అంది పొణ్ణమ్మ. తమిళంలో పొణ్ణమ్మ అంటే బంగారు తల్లి అని అర్థం. "నువ్వు బాగానే ఉంటావు. నీకు ఏ లోటూ రాదు'' అన్నారు భగవాన్ ఆమెతో చనువుగా. "అంతా మీ దయ స్వామీ'' అని ఆమె వినయంగా జవాబిచ్చింది. అయితే, ఆ ముఖ కవళికల్లోని సందేహాత్మక దృష్టి, జంకు, సంశయం వగైరాలను రమణులు గ్రహించారు. "ఏం అడగాలని వచ్చావు'' అని ప్రశ్నించారు. "మా అబ్బాయి ముత్తు స్వామి బాగానే చదువుకుంటాడు. అన్ని పనుల్లో సహాయపడతాడు. కానీ, ఇంట్లో బెల్లం, పంచదారలను మాత్రం బతకనివ్వడు స్వామీ. మాటి మాటికీ కొనాలంటే నా వల్ల కాదు. తమరు వాడికి కొంచెం హితబోధ చేసి, ఆ అలవాటు మాన్పించండి స్వామీ'' అని వేడుకుంది. కొద్ది క్షణాలు ఆలోచించిన రమణులు "మీ అబ్బాయిని తీసుకురా, నేను చెబుతాను'' అని భరోసా ఇచ్చారు. మరునాడు పొణ్ణమ్మ అబ్బాయిని తీసుకు వచ్చి వెనుక వరుసలో కూర్చుంది. ఉదయ ప్రవచనాలు పూర్తయ్యాక అబ్బాయిని రమణుల ముందుకు తీసుకు వచ్చి ఆయనకు చూపించింది. వాడు వినయంగా స్వామికి నమస్కరించాడు. రమణులు కాస్పేపు కళ్లు మూసుకుని 'నాళికి వా/రేపు రా' అన్నారు.
ఆ మరునాడు కూడా ఇదే విధంగా జరిగింది. మరునాడేమిటి? వారం రోజుల పాటు ఇదే విధంగా జరిగింది. ఆమెను ఎప్పుడు చూసినా స్వామి 'నాళికి వా' అంటున్నారు. ఒక్క చిన్న విషయం చెప్పడానికి స్వామి ఎందుకిలా చేస్తున్నారు? ఇట్లా ఎన్ని రోజులు తిరగాలి? ఆమెకు ఓర్పు, సహనాలు నశించాయి. ఒక రోజు ఆకుకూరలు వంటశాల వారికి అప్పగించి, కొడుకును తీసుకుని రమణుల వద్దకు విసురుగా వచ్చింది. "ఇవాళ ఏమైనా సరే, మీరు వీడికి చెప్పి, మందలించాలి స్వామీ. లేకపోతే ఇక్కడి నుంచి కదలను'' అని ఆమె భీష్మించుకు కూర్చుంది. రమణులు నవ్వుతూ, "పొణ్ణమ్మా, చెప్పడం కష్టం కాదు. మొదటి రోజే చెప్పేవాడిని. కానీ, ఇంకొకరికి చెప్పే ముందు మనం ఆచరించాలి కదా. నాకు కూడా తీపి తినే అలవాటుంది. వంట గదిలోకి వెళ్లినప్పుడల్లా ఓ బెల్లం ముక్కను బుగ్గన పెట్టుకుని వస్తాను. ఆ అలవాటు మానడానికి నాకు వారం రోజులు పట్టింది. అంతే'' అని ఆమెకు చెప్పారు. ఆమె ఆశ్చర్యపోయింది. ఆ తరువాత ఆయన ఆ అబ్బాయికి చెప్పి పంపించారు. మనిషి మనసుకు ఎలా బానిస అవుతారో, మనసుని ఎలా నియంత్రించుకోవాలో ఆచరించి చెప్పారు భగవాన్ శ్రీరమణ మహర్షులవారు..@ బహుజన బంధు.

No comments:
Post a Comment