మీ నక్షత్రం ఏం చెపుతోంది...?
నక్షత్రాలు జాతకుని స్వభావాలు తెలుపుతాయి :-
నక్షత్రాల సంఖ్య 27. ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో రెండున్నర
నక్షత్రాలుగా ఉంటాయి. ఈ నక్షత్రాలు జాతకుని స్వభావాలు తెలుపుతాయంటున్నారు
జ్యోతిష్యులు.
1** అశ్విని : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు సంచార
స్వభావం కలవారిగా ఉంటారు. చపలత్వం ఈ జాతకుల స్వభావమని జ్యోతిష్యులు
సూచిస్తున్నారు.
2** భరణి : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు
స్వార్థ ప్రవృత్తి కలిగినవారిగా ఉంటారు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు
తీసుకోవడంలో విఫలమౌతుంటారు, కాబట్టి ఎల్లప్పుడు ఇతరులపై ఆధారపడి, ఇతరుల
నిర్ణయాలను తమ నిర్ణయాలుగా భావిస్తుంటారు.
3** కృత్తిక : కృత్తిక
నక్షత్రంలో పుట్టినవారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇతరుల
వస్తువులు తమవిగా ఆక్రమించుకుంటుంటారు. ముఖ్యంగా వీరు అహంకార స్వభావులై
ఉంటారు. ఈ జాతకులకు నిప్పు, వాహనాలు, ఆయుధాలంటే ఎక్కువగా భయపడుతుంటారని
జ్యోతిష్యులు చెపుతున్నారు.
4** రోహిణి : రోహిణి నక్షత్రంలో
పుట్టినవారు ప్రశాంతవదనంతో, కళాప్రియులుగా ఉంటారు. వీరు మనసులో ఏదీ
దాచుకోరు. ఉన్నతమైన భావాలు కలిగిన వారిగా ఉంటారు.
5** మృగశిర : ఈ జాతకులు భోగలాలసులు. వీరికి అమితమైన తెలివి ఉన్నాకూడా తగిన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించరు.
6** ఆరుద్ర : ఆరుద్ర నక్షత్ర జాతకులు కోపోద్రిక్తులుగా ఉంటారు. నిర్ణయాలు
తీసుకునే సందర్భంలో అవునా, కాదా అన్నట్టు వీరి నిర్ణయాలుంటాయని,
ఎవ్వరినికూడా విరు నమ్మరని జ్యోతిష్యులు అంటున్నారు.
7**
పునర్వసు : ఈజాతకులు ఆదర్శవాదులుగాను, ఇతరులకు సహాయ సహకారాలందించేవారిగాను
ఉంటారు. ముఖ్యంగా వీరు శాంతచిత్త స్వభావులు. ఆధ్యాత్మికం అంటే వీరికి
అమితమైన ఇష్టం.
8** ఆశ్లేష : ఆశ్లేష నక్షత్ర జాతకులు మంకుపట్టు
స్వభావులై ఉంటారు. వీరిలో ఆత్మన్యూనతాభావం ఎక్కువగా ఉంటుంది. స్వయంగా
కష్టాలను కొని తెచ్చుకుంటారు.
9** మఖ : ఈ జాతకులు స్వాభిమానిగా ఉంటారు. గొప్ప గొప్ప కోరికలుంటాయి. సహజంగా నేతృత్వం వహించే లక్షణాలుంటాయంటున్నారు జ్యోతిష్యులు.
10** పూర్వాభాద్ర : వీరు కళలపట్ల ఎక్కువ మక్కువ చూపుతుంటారు. రతిక్రీడలంటే అమితమైన ఇష్టం ఈ జాతకులుకు.
11** ఉత్తరాభాద్ర : ఇతరులతో వీరు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలవారై ఉంటారు ఈ జాతకులు.
12** హస్త : హస్త నక్షత్రం జాతకులు కల్పనా జగత్తులో విహరిస్తుంటారు. వీరు
శుఖ వంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు.
13** చిత్త : చిత్త నక్షత్ర జాతకులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ కనపరుస్తారు.
కొత్త కొత్త ఫ్యాషన్లంటే అమితమైన ఇష్టం. ఎదుటివారిని ఆకర్షించే గుణం
వీరిలో ఉంటుంది. ప్రధానంగా భిన్న లింగ వ్యక్తులతో ఎక్కువగా మసలుతుంటారు.
14** స్వాతి : ఈ జాతకులు అందరిని సమానంగా చూస్తుంటారు. వీరి మనసును
అదుపులో ఉంచుకుంటారు. కష్టాలను ఓర్చుకునే స్వభావులై ఉంటారంటున్నారు
జ్యోతిష్యులు.
15** విశాఖ : వీరు స్వార్థపరులుగాను, జగమొండిగా
వ్యవహరిస్తారు. తాము అనుకునింది చేయాలని ఈ జాతకులు భావిస్తుంటారు. ఏదో ఒక
విధంగా తమదే పై చేయిలా అనిపించుకుంటుంటారు.
16** అనూరాధ : ఈ
జాతకులకు తమ కుటుంబమంటే అమితమైన ప్రేమ. వీరికి శృంగారంమంటే చాలా ఇష్టం.
మృదుస్వభావి, అలంకార ప్రియులుగాకూడా ఉంటారంటున్నారు జ్యోతిష్యులు.
17** జ్యేష్ఠ : జ్యేష్ఠ నక్షత్ర జాతకుల స్వభావం స్వచ్ఛమైనదిగానూ,
ఎల్లప్పుడూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతుంటారు. కాని వీరు శత్రువులను
మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదలరు. దొంగచాటుగా శత్రువులపై దాడికి
దిగుతుంటారు.
18** మూల : ఈ జాతకుల ప్రారంభపు జీవితం కష్టతరంగాను,
కుటుంబంనుంచి చీదరింపులను ఎదుర్కోక తప్పదు. కళలంటే అమితమైన ఇష్టం. వీరు
కళాకారులుగా రాణిస్తారు.
19** పూర్వాషాఢ : పూర్వాషాఢ నక్షత్ర జాతకులు శాంతస్వభావులుగా ఉంటారు.
20** ఉత్తరాషాఢ : ఈ జాతకులు వినయ స్వభావులై ఉంటారు. వీరిలో ఆధ్యాత్మిక
చింతన ఎక్కువగా ఉంటుంది. అందరినీ కలుపుకుపోయే తత్వం వీరిదని జ్యోతిష్యులు
చెపుతున్నారు.
21** శ్రవణం : వీరు సన్మార్గులై, పరోపకారిగాను ఉంటారు.
22** ధనిష్ట : ధనిష్ట నక్షత్ర జాతకుల వ్యవహారం కటువుగా వుంటుంది. కోపం
వీరి సొత్తులాగా ఉంటుంది. వీరు నిత్యం అహంకార పూరితులై ఉంటారని
జ్యోతిష్యులు అంటున్నారు.
23** శతభిష : ఈ నక్షత్రంలో పుట్టిన
జాతకులు రసిక ప్రియులై ఉంటారు. వీరికి రతిక్రీడలంటే ఎక్కువ మక్కువ. వీరు
వ్యసనపరులై ఉంటారంటున్నారు జ్యోతిష్యులు. వీరి సమయానుసారం వ్యవహరించరు.
ఏదైనా పని చేయాలనుకుంటే వీరికి ఇష్టం వచ్చినప్పుడే చేస్తుంటారు.
24** పుష్యమి : పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గులై ఉంటారంటున్నారు
జ్యోతిష్యులు. వీరు బుద్ధిమంతులుగాను, ఇతరులకు దానం చేసే స్వభావులై
ఉంటారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
25**
పూర్వాభాద్ర : ఈ జాతకులు బుద్ధిమంతులై, పరిశోధనాత్మకమైన దృక్పథం
కలిగినవారిగా ఉంటారు. వీరు తమకు అందిన పనిని సమయానుసారం సమర్థవంతంగా
నిర్వహిస్తుంటారు.
26** ఉత్తరాభాద్ర : ఉత్తరాభాద్ర నక్షత్రంలో
పుట్టిన వారు ఇతరులను ఆకర్షించే స్వభావం కలిగినవారై ఉంటారు. వీరి మాటల్లో
చతురత కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఇతరులను ప్రభావితం చేసే గుణం వీరిలో
ఉంటుంది.
27** రేవతి : రేవతి నక్షత్ర జాతకులు సత్యవాదులై ఉంటారు.
ఎల్లప్పుడూ ప్రజల బాగు కొరకు శ్రమిస్తుంటారు. వివేకవంతులుగాను ఉంటారని
జ్యోతిష్యులు చెపుతున్నారు.
No comments:
Post a Comment