తలనొప్పి
సర్వసాధారణ౦. అన్ని వయసుల వాళ్ళు, వృత్తుల వాళ్ళు కూడా తలనొప్పితో తరచుగా
బాధపడుతుంటారు. తలనొప్పి తగ్గడానికి వాళ్ళు కొన్ని మాత్రలు వేసుకుంటారు,
కొన్ని మందుల కోసం కూడా చాలా డబ్బు ఖర్చు పెడుతుంటారు. వీళ్ళకి తెలియని
విషయం ఏమిటంటే, ఇక్కడ చెప్పిన కొన్ని వంటింటి చిట్కాల సహాయంతో తలనొప్పిని
తేలిగ్గా తగ్గించుకోవచ్చు.
1) లవంగాలు, రాళ్ళ ఉప్పు తో చేసిన పేస్ట్ :
తలనొప్పికి ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. మీరు చేయవలసిందల్లా
లవంగాల పొడి, రాళ్ళ ఉప్పు కలిపి పేస్టులా చేసి దాన్ని పాలల్లో వేసి తాగడమే.
ఈ ఉప్పు గుళికలు ఆర్ద్రాకర్షకాలు కనుక అది తలలోని ద్రవాలను పీల్చి నొప్పి
తీవ్రతను తగ్గిస్తుంది.
2) తాజా నిమ్మరస౦, గోరువెచ్చటి నీళ్ళు : ఒక
గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని దాంట్లో కొంచెం నిమ్మరసం కలపండి. ఈ
మిశ్రమం తాగి చూడండి, మీ నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ వంటింటి చిట్కా చాలా
తలనొప్పులకు ఉపయోగకరంగా పనిచేస్తుంది, ఎందుకంటే చాలా తలనొప్పులు కడుపులో
గ్యాస్ వల్ల వస్తాయి. ఈ మిశ్రమం మీ గ్యాస్ ను, తలనొప్పిని కూడా
వదిలిస్తుంది.
3) యూకలిప్టస్ తైలంతో మర్దనా చేయడం : తలనొప్పిని
తగ్గించుకోవడానికి మరో మంచి మార్గం మీ తలను యూకలిప్టస్ తైలంతో మర్దనా
చేయడం, అది నొప్పి నివారిణి కనుక తక్షణ ఉపశమనం కలుగుతుంది.
4) దాల్చిన
చెక్క పేస్టు రాసుకోండి : తలనొప్పి తగ్గడానికి ఒక మంచి గృహ వైద్యం
ఏమిటంటే.. కొంచెం దాల్చిన చెక్కను పొడి చేసి దాన్ని కొంచెం నీరు కలిపి
పేస్టులా చేయండి. ఈ పేస్టును మీ తల మీద రాసుకోండి - మీకు తలనొప్పి నుంచి
తక్షణ ఉపశమనం కలుగుతుంది.
5) చక్కర, ధనియాల మిశ్రమం : ధనియాలు, చక్కెర,
నీళ్ళు కలిపి తాగినా మీ తలనొప్పి తగ్గుతుంది. మీకు జలుబు వల్ల వచ్చిన
తలనొప్పి అయితే, ఈ వంటింటి చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
6)
కొబ్బరి నూనె తో మర్దనా చేసుకోండి : తలకు కొబ్బరి నూనెతో పది, పదిహేను
నిమిషాలు మర్దనా చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. వేసవిలో మీరు తలనొప్పి
బారిన పడితే ఈ ఇంటి చిట్కా చాలా బాగా పని చేస్తుంది, ఎందుకంటే ఇది మాడుకు
చల్లదనాన్ని ఇచ్చి నొప్పి తగ్గిస్తుంది.
7) మీ కాళ్ళు వేడి నీళ్ళలో
వుంచండి : మీ తలనొప్పి తగ్గించుకోవడానికి మరో మంచి ఇంటి చిట్కా ఏమిటంటే,
కుర్చీలో కూర్చుని మీ కాళ్ళను వేడి నీళ్ళు నింపిన బకెట్ లో వుంచండి. నిద్ర
పోయే ముందు ఇలా కనీసం పావుగంట పాటు చేయండి. మీకు దీర్ఘ కాలంగా ఉన్న
తలనొప్పి, లేదా సైనస్ వల్ల వచ్చిన తలనొప్పిని నివారించుకోవచ్చు. ఇలా కనీసం
రెండు నుంచి మూడు వారాల పాటు చేయండి.
కొత్తిమీర, జీలకర్ర, అల్లం కలిపిన
మిశ్రమం తాగండి : కొత్తిమీర, జీలకర్ర, అల్లం కలిపి చేసిన కషాయం తాగితే మీ
తలనొప్పి తేలిగ్గా, వేగంగా తగ్గిపోతుంది. కొంచెం వేడి నీళ్ళు తీసుకుని, ఈ
మూడింటినీ దాంట్లో వేసి అయిదు నిమిషాల పాటు మరగనివ్వండి. దాన్ని వడ పోసి ఆ
ద్రవాన్ని మీకు హాయిగా అనిపించే దాకా రోజుకు కనీసం రెండు సార్లు తాగండి.
9) మీరు తలనొప్పి వల్ల బాధ పడుతుంటే, వెన్న, చాక్లెట్లు, మాంసం లాంటి
పదార్ధాలు మీ ఆహర౦ నుంచి పూర్తిగా తొలగించాలి. దీని బదులు విటమిన్ సి, డి,
బి12, మాంసకృత్తులు, కాల్షియం ఎక్కువగా వుండే ఆహారాలు తినండి. క్యాబేజీ,
కాలీఫ్లవర్, మెంతి కూర, ఇతర ఆకు కూరల్లాంటి పచ్చటి, ఆకు పదార్ధాలు మీ
ఆహారంలో ఎక్కువగా వాడండి. అలాగే, మీకు తలనొప్పి రాకూడదనుకుంటే, బయట దొరికే
జంక్ ఫుడ్ తినకండి.
10) బాగా నిద్రపోండి: ఎక్కువ మందికి తలనొప్పి
రావడానికి ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడమే. అందువల్ల, తలనొప్పి
తగ్గించుకోవాలంటే, ముందు అది రాకుండా చూసుకోవాలి. అందుకని రోజుకు కనీసం 8
గంటల పాటు నిద్రపోతే తలనెప్పులు దూరం అవుతాయి.
No comments:
Post a Comment