ఆది శంకరాచార్య
భువిపై ప్రాణం
పోసుకున్న మానవుడు అద్వైత వేదాంతాన్ని పాటించి ముందుకుసాగాలని సూచించిన
వేదాంత వేత్త ఆది శంకరాచార్యులు వారు. మానవ శరీరం కంటే ఆత్మే గొప్పదని
తెలిపిన మేధావి శంకరాచార్యుల వారు. ఆది శంకరాచార్యుల వారు మహాశివుని యొక్క అవతారమని
భావిస్తారు. ఆది శంకరుని జీవిత విశేషాలను శంకర విజయాలు అనే గ్రంధం ద్వారా
వెలుగులోకి వచ్చాయి. ఆయన స్మార్త బ్రాహ్మణుడిగా 788 సంవత్సరంలో కేరళలోని
కాలడిలో జన్మించారు. ఆయన మొదటి నుంచి సన్యాసిగా జీవనం సాగించారు.
శంకరాచార్యుల వారు ఒకరోజు పెరియార్ నదిలో స్నానం చేసి భిక్షాటన కోసం ఒకామె
ఇంటికి వచ్చారు. ఆమె అసలే పేదరాలు అవటంతో తన దగ్గర ఉన్న ఉసిరిగ కాయను
శంకరాచార్యుని దానం చేసింది. ఆమె పేదరికాన్ని తెలుసుకుని శంకరాచార్యుల వారు
కనకధారా స్త్రోత్రాన్ని రచించారు. ఆ వెంటనే ఆమె ముందు కనకరాసులు కురిసాయి.
లయ కారుడైన శ్రీ మహావిష్ణువు హృదయ సామ్రాజ్ఞి లక్ష్మీ దేవి మీద కనకధారా
స్త్రోత్రాన్ని రచించి శంకరాచార్యుల వారు పావనులయ్యారు.
బ్రాహ్మణులను వాదనతో ఓడించి అపార అనుభవం గడించారు శంకరుల వారు. ఆది శంకర
భగత్పాదులవారు బోధనలను అందరికీ అందించటానికి దేశంలోని నాలుగు ప్రాంతాల్లో
మఠాలను స్థాపించారు. ఆయన రచనలు, బోధనలన్నీ సంస్కృతంలో ఉండటం విశేషం. ఆది
శంకరాచార్యుల వారి బోధనలలో ప్రముఖంగా కన్పించేది ఉపనిషత్తులలోని అంశాలే.
ఆది శంకరాచార్యుల వారి కాలంలో దేశంలో విస్తృతంగా బౌద్ధ మతం ఉండేది. బౌద్ధ
మత సన్యాసులను ఆయన వాదనతో ఓడించేవారు. ఆది శంకరాచార్యుల వారు ఉత్తరాది
పర్యటనలో భాగంగా కాశీ, బదరీలను సందర్శించారు. ఉత్తరాదిలో ప్రముఖ
వేదాంతవేత్త మందన మిశ్రాను కలిసి మీమాంస వేదాంతంలో విషయాలను
తెలుసుకున్నారు.
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా శ్రీశైలం భ్రమరాంబ
మలిఖార్జున స్వామి వార్లను సందర్శించినపుడు శివానందలహరిని రచించారు. అలాగే
నరసింహాస్వామిపై లక్ష్మీ నరసింహ స్త్రోత్తంను విరచించారు. ఆపై కర్ణాటకలోని
శృంగేరి సందర్శించి అక్కడ శారదా పీఠంను ఏర్పాటుచేశారు.
ఉత్తర
భారతదేశ మరో పర్యటనలో భాగంగా నేపాల్, కాశ్మీరములను శంకరాచార్యుల వారు
సందర్శించారు. కాంభోజ ప్రాంతంగా పిలిచే ఉత్తర కాశ్మీరములో సర్వజ్ఞాన
పీఠమును శంకరాచార్యుల వారు ఏర్పాటుచేశారు.
ఆది శంకరాచార్యుల వారు
దేశవ్యాప్త పర్యటనలో నాలుగు పీఠాలను ఏర్పాటుచేశారు. దక్షిణాదిన
కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం, పశ్చిమాదిన ద్వారక, తూర్పున పూరి,
ఉత్తరాదిన జోషీ మఠ్‌లో జ్యోతిర్మఠ్‌లు. ఇవన్నీ చతుర్వేదాలు ఆధారంగా
ఏర్పాటుచేయబడ్డాయి. శంకరాచార్యుల వారు కాలడిలో తనువు చాలించారు.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
No comments:
Post a Comment