ఆలయములందు పాటించవలసిన(ఆగమశాస్త్ర) నియమములు.
యానైర్వా పాదుకాభిర్వా - గమనం భగవద్గృహే
ఉఛ్ఛిష్ఠే చైవ మాశౌచే - భగవద్వందనాదికం.
పాదప్రసారణం చాగ్రే తధా పర్యంక బంధనం
నిగ్రహానుగ్రహాశ్చైవ స్త్రీషు సాకూత భాషణం
కంబలావరణం చైవ పరనిందా పరస్తుతి
శయనం భోజనం చైవ మిధ్యా భాషణమేవచ
అశ్లీల కథనం చైవ అథో వాయు విమోచనం
పృష్ఠీకృత్వాసనం చైవ పరేషామభివందనం
తత్త త్కాలోద్భవానాంచ ఫలాదీనామనర్పణం
వినియుక్తావశిష్టస్య ప్రదానం వ్యంజనాదికం
గురౌమౌనం నిజస్తోత్రం దేవతానిందనం తథా
తాంబూల చర్వణం ఛత్రం అకాలే దర్శనం తథా
ఉఛ్ఛైర్భాషా వృధాభాషా రోదనాద్యం నకారయేత్.(ఆగమ వాక్యం)
--దేవాలయ ప్రాంగణంలోనికి వాహనమునెక్కి పోరాదు.పాదర్క్షలను ధరించి పోరాదు.ఇంటివద్ద లేక నదియందు స్నానము చేసిననూ కాళ్ళు,చేతులు , నోరు ప్రక్షాళనము చేసుకొని ఆలయం లోనికి పోవలెను.కాళ్ళు చాపుకొని,దర్పముగా కూర్చుండరాదు.ఎవరిపైనా కోపగించుటగాని,ఆప్యాయముగా పలకరించుట గాని చేయరాదు.స్త్రీలతో నర్మగర్భముగా మాట్లాడరాదు. చాప,తివాచీ వంటివి పరుచుకుని కూర్చుండరాదు..పరస్తుతి,పరనింద చేయరాదు.అవాచ్యములనరాదు.అనృతభాషణ,వ్యర్థభాషణ చేయరాదు.దేవుని వేపు వీపు పెట్టి కూర్చుండరాదు.ఆలయ ప్రాంగణం లో ఉన్నప్పుడు భగవంతునుకి తప్ప అన్యులకు నమస్కరించరాదు.ఆయాకాలంలో లభించే పండ్లు తేకుండా 'తెద్ద్దామనుకున్నాను -తేలేదు ' అనరాదు.దేవ పూజార్ధమై తెచ్చిన పదార్థాలను,దేవునకు వినియోగించకుండా ఎవరికీ ఇవ్వరాదు.తాంబూలము వేసుకొని,గొడుగు వేసుకొని గుడికి పోరాదు...... ఇవి ఆగమ శస్త్రమందు చెప్పబడిన ఆలయ నియమములు.

No comments:
Post a Comment