కృష్ణ శతకము
పాణితలంబున వెన్నయు
వేణీమూలంబునందు వెలయఁగ పించం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోక నాథుఁడ కృష్ణా!
ఓకృష్ణా!నీవు లోకములకెల్ల ప్రభువునైనను చేతిలో వెన్నముద్దయు,సిగలో నెమలి
పించమును,ముక్కున ఆణిముత్యమును దరించి పసి బాలునివలె ఉంటివిగదా!
అక్రూర వరద మాదవ
చక్రాయుద ఖడ్గపాణి శౌరి ముకుంశా
శక్రాది దివిజసన్నుత
శుక్రార్చిత నన్ను కరుణఁ జూడుము కృష్ణా!
కృష్ణ శతకము..
ఓకృష్ణా!నీవు అక్రూరుడు మొదలైన భక్తులకు కోరిన వరములను ఇచ్చినవాడవు.
ధనమునకు దేవతయైన లక్ష్మీదేవికి నీవు భర్తవు. చక్రము, ఖడ్గము మొదలగు
నాయుధములను ధరించి లోకముల భాదలను పోగొట్టు పరాక్రమము గలవాడవు. ఇంద్రాదులకు
గూడ రాక్షసుల భాదను తొలగించుటజేత వారిచే ఎల్లపుడు కొనియాడబడువాడా, నీవు
మహాత్ముడవు,నన్ను కృపతో చూడుము.
అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!
కృష్ణ శతకము
ఓ కృష్ణా!పసితనమున నీ కాళ్ళ కలంకరించిన అందెలు,గజ్జెలు
చప్పుడగుచుండగా,గంతులిడుచు నేడుకగా నందుని భార్యయగు ఆ యశోద ముందర
ముద్దులొలుకునట్లు నీవు ఆడుచుందువు.
మడుగుకు జని కాళీయని
పడగలపై భరతశాస్త్ర పద్దతి వెలయన్
గడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలఁతు నచ్యుత కృష్ణా!
కృష్ణ శతకము.
కృష్ణా!మహాభయంకరుడయి జనులను భాదించు కాళీయుడను పాము నివసించు సరస్సునకు
పోయి ఆ సర్పపు పడగలపై నాట్యశాస్త్ర విధానము ప్రకారము ఎంతో విలాసముగా
నాట్యమాడిన పాదాలను నా మనస్సులో స్మరింతును.
No comments:
Post a Comment