మనలో చాలామంది ధనం అంటే లక్ష్మీదేవి అని అనుకుంటారు! లక్ష్మిని పూజిస్తారు
మనలో
చాలామంది ధనం అంటే లక్ష్మీదేవి అని అనుకుంటారు! లక్ష్మిని పూజిస్తారు! ఇది
కొంతవరకు నిజమే కానీ! లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు! ఆయుష్షు, మనశ్శాంతి,
సుఖ సంతోషాలు ఇవి లక్ష్మి అంటే!
అసలు ధనం కావాలంటే పట్టుకోవలసింది 'శివుడు'ని! మోక్షం కావాలంటే విష్ణువుని పట్టుకోవాలి!
ఈ సృష్టిలో ఇద్దరే ఉన్నారు! వాళ్ళు 1. లక్ష్మి పుత్రులు, 2. లక్ష్మి రక్షకులు!
లక్ష్మి పుత్రులదగ్గర అధిక ధనం ఉండదు! సరిపడేంత ధనం మాత్రం ఉంటుంది! ఈ
ధనానికి మించిన ఆయుష్షు, మనశ్శాంతి, సుఖ సంతోషాలు పుష్కలంగా ఉంటాయి! దిగులు
లేని జీవితం వీరి సొంతం! కాని వీళ్ళు ఇది గమనించరు! డబ్బు ఎలాగైనా
సంపాదించాలి అనే తపన పడుతుంటారు!
ఇక లక్ష్మి రక్షకులు : వీరి దగ్గర ధనం
పుష్కలంగా ఉంటుంది! ఆయుష్షు, మనశ్శాంతి, సుఖ సంతోషాలు వీరి దగ్గర
పొరపాటునకూడా ఉండవు! అనారోగ్యం, కక్కుర్తి , పీనాసితనం బాగా ఉంటుంది!
రూపాయి కర్చుపెట్టాలంటే ప్రాణం పోయినంత పని అవుతుంది వీళ్ళకి! పొరపాటున
ఏదైనా శుభకార్యం చేశారా వీళ్ళ ఏడుపు ఆపడం ఎవరితరం కాదు! వీరి తత్వం ఎలా
ఉంటుందంటే? ఎవరైనా వస్తే! పైపైకి నవ్వుతూ ఆహా వచ్చారా.. ఎలా ఉన్నారు
అనుకుంటూ లోలోన దిక్కుమాలిన పీనుగు ఎప్పుడు పోతాడో అని తిట్టుకుంటూ ఉంటారు!
ఎప్పుడు పక్కనోడి జేబు మీదే కన్ను ఉంటది! ఇంకా ఇంకా సంపాదించాలి అనుకంటూ
లోలోన కుళ్ళి కృశించి పోతూ రోగాలతో, రోష్టులతో చివరికి హాస్పటల్లో
కొన్నాళ్ళు చచ్చార బ్రతికార అన్నటు ఉండి పోతారు!..
ఇది నేను
చెప్పలేదండి! మళ్ళి నన్ను తిట్టుకోకండి! 5000 సంవత్సరాలకి పూర్వం కలియుగ
మానవుల దౌర్భాల్యాన్ని దివ్య దృష్టితో వ్యాస మహర్షి చూసి మన గ్రంద్ధాల్లో
పేర్కొన్నాడు! ఈ పైన చెప్పింది నిజమో కాదో మీరే చెప్పండి!
చాలా బాగుంది. నమస్కారం.
ReplyDelete