What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 28 June 2013

సకల దేవతామూర్తులకు పూజ విదానం.

సకల దేవతామూర్తులకు పూజ విదానం.

శ్రీ గురుభ్యోనమహా గురువులందరూ సన్నిహితులుగా ఉన్నారని తలచి వారికి నమస్కరించి "హరిహ్ ఓం" అని దేవుని ధ్యానించాలి.

పూజకుముందు రాగిగ్లాసులో నీరు, రాగి ఉద్దరిణె, రాగి పళ్ళెము, తీర్ధపాత్ర, పుష్పములు, గంధము, ఘంట, అక్షతలు, పంచామృతము, గోక్షీరము నైవేద్యానికి పటికబెల్లము, ద్రాక్షగానీ, పండ్లుగానీ, వండిన మహానైవేద్యము, దీపములు, ధూపము, హారతి కర్పూరము అన్నీ ముందుగా సిధ్ధంగా ఉంచుకోవాలి.

తూర్పుముఖముగా కానీ, ఉత్తరముఖముగా గానీ కూర్చొని దైవారాధన చేయాలి. చేయవలెను. మనకు ఎదురుముఖముగా ఆరాధ్య దైవము ఉండాలి. అంటే దక్షిణముఖముగా గానీ, పశ్చిమ ముఖముగా గానీ ఆరాధ్య మూర్తులుండవచ్చును.

స్నానము చేసి విభూదియో, తిరునామమో, తిలకమో పెట్టుకొని ఆసనముపై కూర్చొనవలెను. ఘంటా నాదంతో దీపారధన, భూత శుద్దికొరకు మంత్రము చెప్పి, నీళ్ళు చల్లాలి. ఆచమన మంత్రాలతో నీటిని స్వీకరించాలి.

ప్రాణాయామంచేసి సంకల్పం చెప్పుకోవాలి. గోత్రనామాలు చెప్పి, కలశారాధన, ధ్యానము, ఆవాహన, సాన్నిధ్య ప్రార్ధన, ఆసనము పాధ్యము, ఆర్ఘ్యము, స్నానము, వస్త్రము, ఉత్తరీయము, తిలకం, యఙ్ఞోపవీతము, గంధము, పుష్పము, ఆభరణము, ధూపం, దీపం, మధుపర్కం, నైవేధ్యం(అవార), మహానైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఫల సమర్పణం, పుష్పాంజలీ, ఆత్మ ప్రదక్షిణ, క్షమాప్రార్ధనం, తీర్ధ ప్రాసనం (అకార మృత్యుహారం శ్లోకంతో) ఇవన్నీ పూజా ప్రకరణములు.

తీర్ధం స్వీకరించడంతో పూజా సమాప్తం జరుగుతుంది. ఇంకా విశేషోపచారాలతొ భగవంతుడు పరిపూర్ణ ఆనందం చెందుతాడు. చత్రం, చామరం, నృత్యం, గీతం, వాద్యంలతో బాటు సమస్త రాజోపచారాలు కూడా ఆయనకు చేయాలి. అప్పుడు దేవిగానీ దైవముగానీ (పురుషుడు) అనుగ్రహించి ఇష్టాఇష్టాలను తీర్చి సుఖ శాంతులు అష్ట ఐశ్వర్యాలు 
 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML