పీడితుల కోసం బతికేవాడే నిజమైన శక్తిమంతుడు!
తనకోసం తాను బతికేవాడు గాక, సమాజం కోసం, సమాజంలోని పీడితుల కోసం బతికేవాడే
నిజమైన శక్తివంతుడు. తనలో ఉన్న అద్భుత భావస్ఫూర్తి, ఉత్సాహపూరిత రక్తాన్ని
అందరికోసం వెచ్చించేవాడే నిజమైన యుక్తిపరుడని స్వామి వివేకానంద తన సూక్తుల
ద్వారా ఈ సమాజానికి తెలియజెప్పారు.
ముఖ్యంగా శ్రమైకజీవన
సౌందర్యాన్ని గుర్తించినవాడే ఈ ధరణిలో నిజమైన సుఖాన్ని పొందగలడని,
ఆయాచితంగా వచ్చే ఫలాల కోసం ఆశించేవాడి తత్వం జగానికి శ్రేయోదాయకం కాదు.
ఎప్పుడూ జడత్వంతో నిండివుండి, తాను శ్రమించక, పక్కవాడి కార్యాన్ని
చెడగొట్టేవాళ్లు ఈ సమాజంలో గడ్డిపువ్వులా భావించబడతారని పేర్కొన్నారు.
జడత్వం అనే భావన మనిషిలో నాటుకుంటే ఆ వ్యక్తి శ్రేయోదాయకమైన ఆలోచనలకు తనలో
చోటు కల్పించలేడు. అతని దృష్టిలో 'నేను' అన్నదే మహితమైన పదంగా
నిలిచిపోతుందట. అతనికి శ్రేయస్సు అంటే తానూ, తన కుటుంబం మాత్రమే. మిగిలిన
సంఘం అతనికి అనవసరమైన వస్తువు స్వామి వివేకానంద తెలియజెప్పారు.
నేను ప్రయోజకుణ్ణి అని అనుకుంటే అలాగే అవుతారు. కాకుండా, నేను ఏమీ చేయలేననే
జడత్వంలో కుంగిపోతే నిజంగా వృద్ధుడవే అవుతావు. ఈ మహాసత్యం ఎల్లవేళలా
జ్ఞప్తి పెట్టుకోవాలని స్వామి వివేకానంద సమాజానికి ప్రభోదించాడు. మనం
పనికిమాలిన వాళ్లం కానే కాము. అమోఘ శక్తి సంపన్నత మన హృదిలో నిద్రాణమై
ఉంది. దానికి జాగృతి కల్పించి సర్వాన్ని సాధించే సాధక ధీరరులం మనమేనని, ఇది
జీవన సత్యమని ప్రభోదించారు.
No comments:
Post a Comment