What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 17 June 2013

"శ్రీకృష్ణ కర్ణామృతము"

"శ్రీకృష్ణ కర్ణామృతము"

నవ లావణ్యవిలాసినీతిలక మానందంబునన్ నందసం
భవ పాదార్చిత చిత్తవృత్తి మరలింపన్ నేరకన్, వీటిలో
నవనీతాదిక మమ్ముచో మఱపుఁజెందం, బౌరులం గాంచి "మా
ధవ! గోవింద! ముకుంద! కృష్ణ!" యను నుద్యన్మోహ విభ్రాంతితోన్.1
వ్రేపల్లెలో ఒక గోపిక పాలు,పెరుగు అమ్ముతూ కృష్ణుని యందు మనసు కలదియై "పాలు, పెరుగు" అని కేకలు వేయటం మానేసి అప్రయత్నంగా "మాధవా! గోవిందా!ముకుందా! కృష్ణా!" అనటం ప్రారంభించింది.
- వెలగపూడి వెంగనామాత్యుడు.
("శ్రీకృష్ణ కర్ణామృతము" అనువాదము నుండి)
మూలశ్లోకం:
విక్రేతు కామాకిల గోపకన్యా
మురారి పాదార్పిత చిత్తవృత్తి
దద్యాదికం మోహవశాదవోచ
ద్గోవింద దామోదర మాధవేతి.

గోపద ధూళిథూసరిత కోమలవేషముతోడ, సందెలం
గోపకశాబకాళి తనకుం గయితోడుగ నింటనింటనుం
గ్రేపులఁ గట్టగాఁ దిరుగు కృష్ణుని, దామకరాభిశోభితున్,
గోపకుమారు, నిందువదనున్, మదనుం గనినయ్యఁ గొల్చెదన్. 2
సాయంసంధ్యలలో గోధూళితో కూడిన సుందర రూపముతో , గోపబాలురు తనను అనుసరింపగా వ్రేపల్లెలోని ఇంటింటికీ లేగదూడలను కట్టటానికి తిరుగుతున్న మనోహరుడు, మన్మథుణ్ణి కన్నవాడు అయిన కృష్ణుని సేవిస్తాను.
- వెలగపూడి వెంగనామాత్యుడు.
("శ్రీకృష్ణ కర్ణామృతము" అనువాదము నుండి)

ఎక్కడి గోపరూపమది! యెక్కడి ముద్దు మొగంబు! సోయగం
బెక్కడ! నీ కళావిభవ మెక్కడ! నేమని యెన్నవచ్చున
మ్మక్క! యగోచరంబు భవదాకృతి పద్మభవాది సూక్తికిన్,
మ్రొక్కెద సారెసారెకు నమోహరయే యని నందనందనా!

- వెలగపూడి వెంగనామాత్యుడు.
("శ్రీకృష్ణ కర్ణామృతము" అనువాదము నుండి)

"వెన్నయుఁబాలుఁ ద్రాగుదువు వేగమె లెమ్ము కుమార! తెల్లవా
రెన్నను గన్న తండ్రి! నిదురింపకు! లే !పదివేలయేండ్లు నీ
కున్నెఱ యాయువయ్యెడు ముకుంద!" యటన్న యశోదఁజూచు న
వ్వెన్నుని ముద్దు నెమ్మొగము వేడుకమీర భజింతుమెప్పుడున్.

- వెలగపూడి వెంగనామాత్యుడు.
("శ్రీకృష్ణ కర్ణామృతము" అనువాదము నుండి)

"ముకుందా! తెల్లవారిందయ్యా!వెన్న,పాలు త్రాగుదువుగాని తొందరగా లే మరి!మళ్లీ అలా నిద్రపోకు! నీకు పదివేలయేండ్ల నిండు ఆయుష్షు కలగాలి" అనే యశోదమ్మను చూచి నవ్వే చిన్ని కన్నని ముద్దు మోమును నిరంతరం సేవిస్తాము.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML