What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 19 June 2013

అన్నమాచార్య సంకీర్తన 2

విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో
శాశ్వతులమైతిమింక జయము నాజన్మము
కొండవంటి హరిరూపు గురుతైనతిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువో నాజన్మము
మేడవంటి హరిరూపు మించైన పైడిగోపురము
ఆడనే వాలిన పక్షులమరులు
వాడల కోనేటిచుట్ల వైకుంఠ నగరము
ఈడమాకు పొడచూపె ఇహమేపో పరము
కోటిమదనులవంటి గుడిలో చక్కనిమూర్తి
ఈటులేని శ్రీవేంకటేశుడితదు
వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ
కూటువైనన్నేలితి యెక్కువవో నాతపము

అన్నమాచార్య సంకీర్తన

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML