---------- Forwarded message ----------
From: krishna kishore <telugubandhu@gmail.com>
Date: 2013/12/2
Subject:
To: krishna kishore <telugubandhu@gmail.com>

ధర్మము నశించి అధర్మము పెచ్చుపెరిగినపుడల్లా భూమిపైననే అవతరిస్తాను అని భగవంతుడు గీతలో అంటాడు.్భగవంతుడు శ్రీకృష్ణుడుగా దేవకి వసుదేవులకు కారగారమున జన్మించి నందుని ఇంట పెరిగి పెక్కురు రాక్షసుల సంహరించెను. ఇక రామాయణ విషయంలో, దశరథునికి పుత్ర సంతతిలేకపోవుటచే ఋష్యశృంగుడు, దశరథునికి పత్రకామేష్టియాగం చేయిస్తానన్నాడు. ఆ క్రమంలో హోమం ప్రారంభమైంది. హవిస్సును తీసికొని వెళ్లడానికి, దేవతలంతా ఒక్కొక్కరుగా అక్కడకు వచ్చారు.
రావణుని దురాగతాలకు అంతులేకుండా పోయింది. వానిని సంహరించే కుమారుడు కలగాలని, దేవతలంతా అనుకొంటుండగా బ్రహ్మవిని, మనుష్య జాతిపై రావణుని చిన్న చూపు వుంది. మానవులపట్ల తనకేమి ప్రమాదం లేదనుకొన్నాడు. తనకు మరణం వారివల్ల కలగదని వరం కూడా కోరుకోలేదు అన్న విషయాన్ని బ్రహ్మ అక్కడ ఉన్న దేవతలకు వివరించెను. అందువల్ల రావణ సంహారానికి మానవుడే తగిన వాడని బ్రహ్మవారికి సూచించినాడు. ఆ సూచన అక్కడ ఉన్నవారికి ఎంతగానో నచ్చింది. శ్రీ మహావిష్ణువు కూడా అక్కడికి వచ్చాడు. దేవతలు ఋషులు అందరూ నమస్కరించి, రావణుని పీడ విరగడవునట్లు ఏదైనా ఉపాయం చెప్పమన్నారు. రావణుడు సృష్టిలో ఎవరిచేత మరణించడని, ఒక్క మానవమాత్రునితో మాత్రమే మరణిస్తాడని, బ్రహ్మవలన తెలిసికొని, తాను ఎవరి యింట మనిషిగా జన్మించాలా అని ఆలోచిస్తుండగా, అశ్వమేథయాగం పూర్తిచేసి పుత్రకామేష్ఠియాగం చేయుచున్న దశరథుని యింట పుట్టవచ్చని దేవతలు సూచించారు. ఆ సూచన విష్ణువుకు ఎంతగానో నచ్చింది. తాను దశరథుని యింట జన్మించి, రావణ సంహారము చేసి చాలా కాలం రాజ్యపాలన చేస్తానన్నాడు. తన భార్య శ్రీ మహాలక్ష్మి జనకుని ఇంట సీతగా జన్మింపజేశాడు. తనకు సహాయకారులుగా ఉండడానికి దేవతలనందరిని అప్సరసల గర్భాన వానరులుగా జన్మింజేయమని బ్రహ్మను కోరారు. బ్రహ్మ అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత భూలోకంలో దశరథుడు పుత్రకామేష్ఠియాగం చేయుచుండగా, యజ్ఞకుండము నుండి ప్రాజాపాత్య పురుషుడు ఆవిర్భవించాడు.
ఎర్రని ముఖంతోను, ఎరుపు నలుపు కల్గిన వస్త్రంతోను, శరీరమంతట వెంట్రుకలతో పెద్ద పెద్ద మీసాలతో, సింహపు జూలులాంటి శిరోజాలతో, అగ్నిహోత్రుడిలా ప్రకాశిస్తూ, దశరథుడి ఎదుట నిలిచాడు. ఆ ప్రాజాపత్య పురుషుడు దశరథునికి, సంతానాన్ని కలిగించేది, ఆరోగ్యాన్ని వృద్ధి చేసేది, దేవలోకానికి చెందినది అయినటువంటి పాయస పాత్ర తాను తెచ్చినట్లు ఆ పాయసాన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఇవ్వమని మేఘ గంభీర స్వరముతో పలికి అంతర్థానమయాడు. అంత దశరథుడు రాణులను శుచిర్భూతులై రమ్మనమని చెప్పి పాయసమును వారికిచ్చెను. పాయస పంపకము ఈ విధంగా దశరథుడు ఇచ్చాడు.
దైవ నిర్ణయం, ప్రకారం, రామలక్ష్మణ, భరత శత్రుఘు్నలు నలుగురు జన్మించారు.
బ్రహ్మదేవుడు రావణ సంహారానికి వీలుగా, రాముడికి సహాయంగా సహకరించేందుకు దేవతల అంశలలో కోట్లాది వానర సేనలను జన్మింపజేశాడు. రామాయణంలో కవి మొత్తంగా సత్యము, ధర్మము దర్శింపజేస్తాడు. ధర్మసంస్థాపన కోసం కావ్యం రచించాడు. లంకలో సంపద రాసులు పోసినట్లుగా, రమణీయమైన ఉద్యానవనాలు, మణిద్వీపాలు ఉన్నాయి. నీతిబాహ్యమైన కామము ఉంది.
ఇటువంటి సమాజమును, అనాగరికతను, కూల్చుటకు, నీతివంతుడు, శక్తిపరుడు రాముడు తగినవాడు. రావణుడు పశుబలం, శ్రీరామునకు ధర్మబలం. రాముని ఔన్నత్యం హిమవత్పర్వతమంతది.
''ఏకో రామః ధర్మాత్మ'' అన్న ధర్మబలంగల ఒక రాముడు వేల పశుబలం కల్గిన రాక్షసును సంహరించాడు. అందుకే దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు తగిన సమయం చూసి దైవం సంకల్పించిందని ఈ రామాయణ కథా సందర్భము వివరిస్తుంది

No comments:
Post a Comment