తిరుమల కొండల మీదకి వెంకటేశ్వర స్వామి రాకముందు అది ప్రసిద్ద వరాహ క్షేత్రంగా పేరుపొందింది. వరాహ స్వామివారు కొలువై వున్నారు. ఇప్పటికి కూడా కోనేరు ప్రక్కన వరాహస్వామి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ముందు వరాహస్వామి వారిని తప్పక దర్శించుకోవాలి.
అసలు ఇలా ఎందుకు చేయాలి అంటే! ఈ విషయం బ్రహ్మాండ పురాణంలో ఇలా ఉంది.
తిరుమలగిరుల మీద ఉన్న వరాహస్వామి వారి దగ్గరికి గోవిందుడు వచ్చి! నేను ఇక్కడ కొలువై ఉంటాను. నాకు స్థానం కావాలి అని వరాహస్వామిని అడిగారట. దానికి వరహస్వామివారు! నాకంటే నీకే ఎక్కువ పేరు వచ్చేలా ఉంది కదా ఈ కలికాలంలో. అడిగినవారికి ఉదారంగా వారలు ఇచ్చి అనుగ్రహిస్తావు. ఆపద మొక్కులవాడివి అవుతావు. కోరుకున్నవారికి కొంగుబంగారమై కష్టాల కడలి నుండి అవలి తీరం చేరుస్తావు. ఈకలికాలంలో ఏడుకొండల వాడి పేరు సమస్త భూమండలం మొత్తం వ్యాపిస్తుంది కదా అంటే! అప్పుడు గోవిందుడు! ఐతే నీకు వరం ఇస్తున్నాను. ఎవరైతే నా దర్శనానికి వస్తారో వారు ముందుగా నిన్నే దర్శించుకుంటారు. అలాకాకుండా నాదగ్గరకి వస్తే నన్ను దర్శనం చేసుకున్న ఫలం ఇవ్వను. అని వరం ఇచ్చాడు. ఆనాటి నుండి వరాహ క్షేత్రం తిరుమల క్షేత్రమై వెలుగొందుతున్నది.


No comments:
Post a Comment