What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 24 December 2013

కపిల మహర్షి

కపిల మహర్షి
'కపిల మహర్షి (హిందీ: कपिल ऋषि : Maharishi Kapila) వేద కాలపు హిందూ మహాముని. ఇతని గురించి శ్రీమద్భాగవతం లో సాంఖ్య శాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలను రచయితగా పేర్కొన్నది.[1]. ఇవి సాంఖ్య గ్రంథముగా లభ్యమవుతునాయి. దీనిని సాంఖ్య కారిక అని అఓటారు. దీనిలో 7 విభాగాలు ఉన్నవి. [2] దీనికి ఉన్న అనుభంధాలు మరియు వ్యాక్యానాలతో కలిపి ఇది ఆరు అధ్యాయాలుగా విస్తరించింది. కాలంతో పాటు దీనికి అనేక వ్యాక్యానాలు వ్రాయటం జరిగింది. దీనికి ఉదాహరణ అనిసరుధ్ధుడు రచించిన కపిల సాంఖ్య ప్రవఛన సూత్ర వృత్తి . [3].
మహాభారతంలో పేర్కొన్నట్లుగా, ఇతడు ఏడుగురు బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు. ఇతరులు అనిరుద్ధుడు, సనత్కుమారులు.[4]. విష్ణు పురాణంలో ఇతన్ని మహావిష్ణువు యొక్క అవతారం గా పేర్కొనబడినది.[5] ఇతడు భక్తి యోగంలో ముక్తిని సాధించే ప్రక్రియను బోధించే గురువుగా ప్రసిద్ధులు.
కపిలముని జీవితం గురించిన చాలా వివరాలు శ్రీ మధ్భాగవతంలోని 3వ స్కంధము 33వ అధ్యాయము అయిన కపిలుని పనులు లలో లభ్యమౌతున్నాయి. [1], ఇందులో ఉన్న వివరాల ప్రకారం - అతని తల్లి తండ్రుల పేర్లు కర్దమ ముని మరియు దేవహూతి. తన తండ్రి ఇల్లు వదలి వెళ్ళిన తరువాత కపిలముని తన తల్లి అయిన దేవ హూతికి యొగ శాస్త్రాన్ని అభ్యసించమని విష్ణువుని ప్రార్థించమని, వాటి వలన దేవుని యెడల నిజమైన భక్తి మోక్షము కలుగుతాయని సలహా ఇచ్చాడు. [6]
గంగావతరణం
సూర్యవంశపు రాజైన సగరునకు ఇద్దరు భార్యల వలన 60 వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగధేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60 వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు. వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.
భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివుని కోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపై మోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్ధనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML