హిందూ
మతం ఒక నిరంతర గంభీర ప్రవాహం. సనాతన ధర్మ పీఠం. అదొక మహాసముద్రం. దానిలోని
నీరును ఎంత తోడి ఖాళీ చేద్దామనుకున్నా ఖాళీ అవుతుందా? ఇంకిపోతుందా? కాదు.
కానేకాదు. గంభీరమైన ఆ హిందూ మహా సముద్రంలో ఎన్నో నదులు/ (మతాలు) చేరినా
దాని స్వస్వరూపం, పరిమాణం ఏమీ తగ్గదు. గుణం చెడదు. ఇంకా బలోపేతమవుతుంది.
దీనికి కారణం ఇదొక మతం కాదు, జీవన విధానం. సనాతన (వేద విదితమైన)
శాస్త్రీయమైనది దీని ఆధ్యాత్మికత. అందుకే, ఎన్ని దుర్మార్గపు
దాడులు జరిగినా, విధ్వంసాలు జరిగినా, ఘోరమైన ద్వేషపూరితమైన మత
మార్పిడిలు జరిగినా, మతద్వేషం కక్కినా ఈ పుణ్యభూమిలో, ఈ కర్మ భూమిలో,
అణువణువూ నిండి నిబిడీకృతమైన సహిష్ణుత, సర్వ మానవ సౌభ్రాతృత్వం, లోక
కల్యాణం కోసం, ఈ జాతి పడే తపన దీనిని చెక్కు చెదరనీయదు.
గంభీరమైన ఐరావతం వలే, హుందాగా ముందుకు నిరంతరంగా కదులుతూనే ఉంటుందని మా ప్రగాఢ విశ్వాసం. మహాసముద్రం వంటి హిందూ మతానికి అంతం లేదు. ఉండదు. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో ఈ మేధా బ్రువులకు తెలియదనుకోను.
గంభీరమైన ఐరావతం వలే, హుందాగా ముందుకు నిరంతరంగా కదులుతూనే ఉంటుందని మా ప్రగాఢ విశ్వాసం. మహాసముద్రం వంటి హిందూ మతానికి అంతం లేదు. ఉండదు. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో ఈ మేధా బ్రువులకు తెలియదనుకోను.
No comments:
Post a Comment