పార్వతి
" అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ "
పార్వతి (ఆంగ్లం: Parvati) హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
ప్రధాన కధ
వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12)లో ఉమ లేదా హైమవతి అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మమును గురించిన జ్ఞానము తెలియజేసింది. [1] క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కధలు ఉన్నాయి.
పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.
వినాయకుడు, కుమారస్వామి వారి పుత్రులు.
మత సంప్రదాయాలు
పేర్లు, అవతారాలు
పార్వతికి ఎన్నోపేర్లు ఇంకెన్నో అవతారాలూ కలవు వాటిలో కొన్ని -
• హైమ - హేమ (బంగారం) వర్ణము కలిగినది
• అపర్ణ - పర్ణములు (ఆకులు) కూడా తినకుండా తపస్సు చేసినది.
• శాంభవి - శంభుని అర్ధాంగి
• భైరవి -
• భగమాలిని -
• మహిషాసుర మర్ధిని - మహిషుడు అనే రాక్షసున్ని సంహరించినది.
• మాతంగి -
• బగళాముఖి -
• శివాణి, పరమేశ్వరి, ఈశ్వరి, మహేశ్వరి - ఈశ్వరుని అర్ధాంగి, సకల లోకములకు అధిదేవత
• చాముండేశ్వరి - చండ, ముండులను సంహరించినది
• కాత్యాయని - గొప్ప ఖడ్గము ధరించినది
• ఉమ - బిడ్డా, తపమునకు పోవద్దని తల్లి మేనకచే పిలువబడినది
• దాక్షాయణి - దక్షుని బిడ్డ సతీదేవిగా అవతరించినది
• భవాని
• త్రిపుర సుందరి, లలిత, రాజరాజేశ్వరి, శ్రీదేవి
• బాల
• కామేశ్వరి - సకల కామితార్ధములను ప్రసాదించునది
• శతాక్షి, శాఖంభరి - (దేవీ భాగవతంలోని కధలు)
• అంబిక - తల్లి
• దుర్గాదేవి, శక్తి,
• అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, పెద్దమ్మ, సురారుల కడుపారడి బుచ్చినయమ్మ
• అన్నపూర్ణ
• కనకదుర్గ
గ్రంధాలూ, పురాణాలూ
• దేవీ భాగవతం
• స్కంద పురాణం
దేవాలయాలుశక్తిపీఠాలు
• శ్రీశైలం - భ్రమరాంబ
• మధురై - మీనాక్షి
• కంచి - కామాక్షి
• కాశి - అన్నపూర్ణ, విశాలాక్షి
• । భద్రకాళీ దేవాలయము - వరంగల్
•
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశెఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥
దుర్గా మాత మొదటి స్వరూపము 'శైలపుత్రి' నామం తో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు 'శైలపుత్రి' అనే నామం వచ్చినది. వృషభ వాహనారుఢయైన యీ మాత కుడి చేతి లో త్రిశూలమ్, ఎడమ చేతిలో కమలము విరాజిల్లుచుండును. నవ దుర్గలలొ మొదటిది యీ అవతారమే.
పుర్వజన్మం లో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక.అప్పుడు ఈమె పేరు సతీ దేవి ఒకసారి దక్షుడు ఒక మహా యాగం ను నిర్వహిస్తూ మిగిలిన దేవతలందరినీ ఆహ్వనిన్చ్ ఆహ్వానించి పరమేశ్వరుడిని పిలువలేదు.తండ్రి యజ్ఞం చేస్తున్న విషయం తెలిసి సతీ దేవి తానూ ఆ యజ్ఞానికి వెళ్ళాలని ఉబలాట పడింది. భర్త యైన పరమశివుడిని ఆమె అనుమతి కోరగా అందుకు శివుడు నిరాకరించెను. యీ హిత వచనం సతీదేవి చెవికెక్కలేదు. యీ యజ్ఞ మిష తోనైనా అక్కడకు వెళ్లి తన తల్లి, తోబుట్టువులను చూడవలెననే కోరిక ప్రబలంగా ఉండడం తో అనుమతికై ఆమె పట్టుబట్టేను. ఆమె పట్టుదల చూసి శివుడు ఆమెకు అనుమతి యిచ్చెను.
సతీదేవి తండ్రి ఇంటికి వెళ్ళగా అక్కడి వారెవ్వరూ ఆమెను ఆదరించలేదు. అన్దరూ ముఖము ప్రక్కకు తిప్పుకున్నారు. తల్లి మాత్రం ప్రేమతో కౌగలించుకొనెను. తోబుట్టువులు పరిహాసం చేసారు. యీ ప్రవర్తనకు సతీదేవి మనసు కలత చెందెను. అందరిలోనూ తన భర్త పట్ల నిరాదరణ భావమే కనబడెను. దక్షుడు ఆమె తో అవమానకరం గా మాట్లాడెను. యిదంతా చుసిన సతీదేవి హృదయం క్రోధం తో ఉడికిపోయెను. తన భర్త కు జరిగిన ఈ అవమానం ఆమె సహించలేక ఆమె యోగాగ్ని లో అక్కడే తన శరీరం భస్మమొనర్చెను.
సతీదేవి గా తనువును త్యజించిన ఆమె మరుజన్మ లో శైలరాజైన హిమవంతునకు పుత్రికగా జన్మించెను. ఇప్పుడామె 'శైలపుత్రి' గా రూఢికెక్కెను. ఉపనిషత్తులలోని ఒక కఠ ననుసరించి ఆమె హైమవతి రూపమున దేవతల గర్వం అణచెను. శైలపుత్రి అవతారం నందు కూడా ఆమె పరమేశ్వరుడినే పరిణయమాడెను. 'శైలపుత్రి' యొక్క మహిమలు, శక్తులు అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటి రోజున ఈ దేవికి పూజలు, ఉపాసనలు జరుపబడును. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలధార చక్రమున స్థిరపరచుదురు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.
-- " అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె

kishore always with u....!

No comments:
Post a Comment