What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 2 December 2013

చాముండి, చాముండ లేదా చాముండేశ్వరి

చాముండి 
చాముండి, చాముండ లేదా చాముండేశ్వరి (Chamunda (సంస్కృతం: चामुण्डा, Cāmuṇḍā), also known as Chamundi, Chamundeshwari and Charchika) హిందూ దేవత దేవి యొక్క ఉగ్ర అవతారం. ఈమె సప్తమాతృకలు లో ఒకరు. ఈమె దుర్గాదేవి యొక్క సైన్యంలోని 81-మంది తాంత్రిక దేవతలలో ఒక ముఖ్యమైన యోగిని. [1] చాముండ పేరు ఆమె సంహరించిన చండ మరియు ముండ అనే ఇద్దరు రాక్షసుల కలయికతో ఏర్పడినది. ఈమెను కాళికాదేవి కి దగ్గరగా పోలుస్తారు.[2] ఈమెను కొన్నిసార్లు పార్వతి దేవిగా కొలుస్తారు. కొంతమంది జంతుబలిని ఇచ్చి, మద్యంతో సహా రావి/మర్రి చెట్టు మూలంలో పూజిస్తారు. ఈమె ప్రాథమికంగా ఆదిమవాసుల దేవతగా ప్రాచీనకాలం నుండి భక్తుల పూజలందుకొంటున్నది. చాముండి మధ్య భారతదేశంలోని వింధ్య పర్వతాలలో నివసించే ముండ ప్రజల ఆరాధ్య దేవత.
సప్తమాతృక చాముండి
సప్తమాతృకలు లేదా ఏడుగురు తల్లులు లో ఒకరుగా మహాభారతం (వన పర్వం), దేవీ పురాణం మరియు విష్ణుధర్మోత్తర పురాణం మొదలైన హిందూ గ్రంథాలలో ప్రస్థావించబడినది. సప్తమాతృకల శిల్పాలలో ఈమెను ఎల్లోరా మరియు ఎలిఫెంటా గుహలలో చూడవచ్చును. ఈమెను ఏడుగురికి అధిపతిగా కుడివైపు చివరగా ఉంటుంది.[3] మాతృకలలో మిగిలిన వారిని వారివారి భర్తల శక్తి స్వరూపాలుగా కొలువగా ఒక్క చాముండిని మాత్రం ప్రత్యేకంగా కొలుస్తారు.[4]
దేవీ పురాణంలో మాతృకలు రాక్షస సంహారంలో వినాయకునికి సహాయం చేసినట్లు పేర్కొన్నది.[5] మాండవ్య మహాముని పంచమాతృకలో ఒకరిగా చాముండిని పూజించాడు. వీరిని బ్రహ్మ హరిశ్చంద్రుడు పడుతున్న కష్టాలను చూచి వాటినుండి అతనిని రక్షించడానికి సృష్టించాడని చెబుతారు.[6]
దేవాలయాలు


మైసూరులోని చాముండేశ్వరి దేవాలయం. 1947 వరకూ ఈ నగరం ఒడయార్లు పరిపాలిస్తున్న మైసూరు రాజ్యానికి రాజధానిగా ఉండేది. 18 శతాబ్దం లో కొద్దికాలం మాత్రం హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లు పరిపాలించారు. ఒడయార్లు సంస్కృతి కళలంటే ప్రాణమిచ్చే వారు. ఈ విధంగా నగరాన్ని సంస్కృతికి నిలువుటద్దంగా తయారు చేశారు. హిందూ పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు మహిషూరు అని పిలువబడే ఈ ప్రాంతం మహిషాసురుడు అనే రాక్షసుని పరిపాలనలో ఉండేది.[3] ఈ రాక్షసుణ్ణి దగ్గరే ఉన్న కొండపై కొలువున్న చాముండీ దేవి సంహరించిందని ప్రతీతి. తర్వాత కాలక్రమంలో మహిషూరు, మహిసూరుగా మారి చివరకు మైసూరు అనే స్థిరపడింది.[4]

ప్రస్తుతం మైసూరు నగరం ఉన్న ప్రాంతాన్ని 15వ శతాబ్దం వరకు "పురగేరె" అనేవారు.[5] 1524లో "మహిషూరు"కోటను 3వ చామరాజ వొడయార్ (1513–1553) నిర్మించాడు. తరువాత ఇక్కడి పాలన అతని కొడుకు 4వ చామరాజ వొడయార్ (1572–1576) క్రిందికి వచ్చింది. 16వ శతాబ్దంనుండి నగరాన్ని "మహిషూరు" అనసాగారు. తరువాత ఇది మైసూరుగా పరిణమించింది.[5]. విజయనగర సామ్రాజ్యం కాలంలో వొడయార్‌ల మైసూరు రాజ్యం వారికి సామంతరాజ్యంగా ఉండేది. అప్పటిలో మహిషూరు వొడయార్ల రాజధాని. దగ్గరలోని శ్రీరంగపట్నం విజయనగర సామ్రాజ్య ప్రతినిధి కార్యాలయకేంద్రంగా ఉండేది. 1565లో విజయనగర సామ్రాజ్యం పతనమయ్యింది. 1610లో రాజా వొడయార్ శ్రీరంగపట్నంలోని సామ్రాజ్య ప్రతినిధిని ఓడించి తన రాజధానిని శ్రీరంగపట్నానికి మార్చాడు. క్రమంగా మైసూర్ వొడయార్లు స్వతంత్ర పాలకులయ్యారు. 1637లో నరసింహరాజ వొడయార్ పాలనాకాలంలో మైసూర్ పూర్తి స్వతంత్ర రాజ్యమయ్యింది.[6]

శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ అధికారంలో ఉన్నపుడు మైసూర్ నగరం చాలావరకు నాశనం చేయబడింది. వొడయార్‌ల పాలనను అంతం చేయడమే అతని ఉద్దేశ్యం.[7] 1799లో 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించాడు. అనంతరం రాజధాని మళ్ళీ మైసూరుకు మార్చబడింది.[8][9] అప్పటి రాజు ముమ్మడి కృష్ణరాజ వొడయార్ ఇంకా బాలుడు అవడంవలన పాలనా వ్యవహారాలు అధికంగా పూర్ణయ్య అనే దివాన్ నిర్వహించేవాడు. మైసూర్ నగరం అభివృద్ధికి, ముఖ్యంగా పౌర సదుపాయాల విషయంలో, పూర్ణయ్య చేసిన కృషి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి దోహదపడింది.[10] 1831లో బ్రిటిష్ కమిషనర్ మార్క్ కబ్బన్ రాజధానిని బెంగళూరు నగరానికి మార్చాడు. దానితో మైసూరు నగరం రాజధాని హోదా కోల్పోయింది[11]. మళ్ళీ 1881లో బ్రిటిష్ పాలకులు మైసూరు రాజ్యాన్ని వొడయార్ పాలకులకు అప్పగించారు. [12] అప్పటినుండి 1947వరకు మళ్ళీ మైసూరు నగరం రాజధానిగాను, మైసూరు కోట పాలనాకేంద్రంగాను వర్ధిల్లాయి.
• మైసూర్ పురపాలక సంస్థ (మునిసిపాలిటీ) 1888లో ప్రాంభించబడింది. పట్టణాన్ని 8 వార్డులుగా విభజించారు.[13] 1897లో ప్రబలిన ప్లేగు వ్యాధి(bubonic plague) వలన పట్టణం జనాభాలో షుమారు సగం మంది మరణించారు.[14] 1903లో నగరం అభివృద్ధి ట్రస్ట్ బోర్డు (City Improvement Trust Board - CITB) ఏర్పాటయ్యింది. ఇలా ఆసియాలో ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి కార్యక్రామలు చేపట్టిన తొలి నగరాలలో ఒకటిగా మైసూరును పేర్కొనవచ్చును.[15] స్వాతంత్ర్యం తరువాత మైసూర్ రాజసంస్థానం భారతదేశంలో విలీనం అయ్యింది. మైసూర్ రాజు జయచామరేంద్ర వొడయార్ "రాజప్రముఖ్" అయ్యాడు. అతను 1974లో మరణించాడు.[16] కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో చాముండేశ్వరి కొండ మీద చాముండేశ్వరి దేవాలయం ప్రసిద్ధిచెందినది. ఇది మైసూర్ రాజ్యం వంశీకుల కులదేవతగా పూజలందుకున్నది.
• మధ్యప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా లో పాలంపూర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ దేవి రుద్ర చాముండగా కొలువబడుచున్నది.
తెలుగు: చాముండేశ్వరి
Affiliation: శక్తి దేవి
నివాసం: శ్మశానం

మంత్రం: Om aim hrim klim Chamundayai vichche
ఆయుధం: త్రిశూలం మరియు ఖడ్గం

వాహనం: గుడ్లగూబ లేదా శవం

--
kishore always with u....!


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML