What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 2 December 2013

కటాసరాజ ఆలయం


కటాసరాజ ఆలయం
కటాసరాజ ఆలయం, పాకిస్తాన్‌లోని పంజాబురాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ దేవాలయం. ఇది చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉన్నది. ఇది ఒక శివాలయం. మహాభారతకాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపినట్టు భావిస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం, ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తేవాలని భావిస్తోంది. మూడు దశల్లో, దీని పునరుద్ధరణకు 20 మిలియన్లు కేటాయించాలని కూడా ప్రతిపాదించినది.

దక్షయజ్ఞసమయంలో, సతీదేవి ప్రయోప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రాలాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్ తీర్థంగానూ, రెండవది భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్)లోని పుష్కరరాజ్ తీర్థంగానూ మారాయి.
మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృష్యవాణి పలికినది... ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. వీటినే, యక్షప్రశ్నలుగా హిందువులు చెప్పుకుంటూ ఉంటారు. ఇది కటాసక్షేత్రంలోని అమృతకుండ్ వద్దనే జరిగింది.
చరిత్ర
ఇక్కడ100కి పైగా ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం 900 సంవత్సరాలు లేదా అంతకన్నా పూర్వానివేనని చరిత్రకారుల ఉద్దేశ్యం. కటాసక్షేత్రం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు విశ్వవిద్యాలయంగా కూడా భాసిల్లినది. ఎందరో దేశీ, విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తూ ఉండేవారు. ప్రముఖ గణితజ్ఞుడు ఆల్బెరూనీ ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ, భూమి చుట్టుకొలతను లెక్కించాడు. 1947 కాలంలో ఇక్కడి హిందువులందరూ భారతదేశంలోని పంజాబుకు వెళ్లిపోయారు.
ప్రస్తుతం
ఈ ఆలయక్షేత్రాన్ని ప్రపంచవారసత్వ సంపదగా గుర్తింపజేయాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. 2006-07లో ఇక్కడి ఏడు ఆలయాలలో విగ్రహాలను పునఃప్రతిష్టించేందుకు నిర్ణయించి 51.06 మిలియన్ రూపాయలను కేటాయించింది. భారతదేశంనుండి ఈ విగ్రహాలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకొంది.ఈ పని మీద, ముగ్గురు పురాతత్వవేత్తల జట్టు భారతదేశంతోపాటు, శ్రీలంక, నేపాల్‌లలో కూడా సందర్శించింది. 

--
kishore always with u....!


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML