What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 26 December 2013

నీళ్ల విరేచనాలు - అతిసారము , నోటి పూత , నోటిలో దుర్వాసన , పక్కలో మూత్ర విసర్జన చేయుట , పరిణామ శూలలు

నీళ్ల విరేచనాలు - అతిసారము



నీళ్ల విరేచనాలు - అతిసారము


  • దానిమ్మ బెరడు చూర్ణము 2 నుండి  3 గ్రాములు, ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచుండిన అతిసారము లేక విరేచనములు తగ్గిపోవును. 
  • బొప్పాయి పండు తినుచున్న ఎడల ఏ మందుకూ తగ్గని నీళ్లవిరేచనాలు తగ్గిపోవును.  
  • బూరుగు జిగురు, పటిక బెల్లము సమభాగములుగా కలిపి నూరి పూటకొక గ్రాము పొడిని మంచినీళ్లతో రెండు పూటలా ఇచ్చిన, ముఖ్యముగా పిల్లలలో కలుగు అన్ని రకముల విరేచనములు తగ్గును.

నోటి పూత 

  • పటిక ఒక గ్రాము, ఒక శేరు (1 లీటరు) నీళ్లలో కరిగించి, ఆ నీళ్లను పుక్కిలించుటకు ఉపయోగించవలయును. 
  • పేరిన నెయ్యిని నాలుకపై మరియు నోటి లోపల పూయవలెను.

నోటిలో దుర్వాసన 


  • జాపత్రిని నోటిలో ఉంచి నములుచున్న ఎడల నోటి దుర్వాసన హరించబడును.

పక్కలో మూత్ర విసర్జన చేయుట  

  • ఒక చిన్నము (అర గ్రాము) ఆవాల పొడిని పాలలో కలిపి రాత్రి పడుకొనే ముందు ప్రతినిత్యమూ త్రాగించవలయును. వారం రోజులలో పిల్లలు పక్క తడుపుట ఆగిపోవును. 
  • ఆవాలను వేయించి, పొడిచేసి ఒక గ్రాము మాత్ర అన్నము తినేటప్పుడు మొదటి ముద్దలో కలుపుకొని తినుచున్న ఎడల పెద్దలలో ఈ వ్యాధి తగ్గిపోవును.

పరిణామ శూలలు 

  • వెల్లుల్లి చెట్టు ఆకులు దంచి రసం తీసి, ఒకటి నుంచి రెండు చెంచాల రసము (5 నుండి 10 మి.లీ.) లో సమానముగా తేనె కలుపుకొని రెండు పూటలా సేవించుచున్న ఎడల అసాధ్యమగు పరిణామశూలలు హరించిపోవును. ఈ విధముగా కనీసము 15 రోజులు వాడవలెను. ఔషధం సేవించు దినములలో కేవలం మజ్జిగ అన్నం మాత్రమే తినవలెను.
 
- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML