What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 24 December 2013

పౌర్ణమి రోజున చంద్ర భగవానుడిని పూజిస్తే..?

పౌర్ణమి రోజున చంద్ర భగవానుడిని పూజిస్తే..?

జ్యోతిష్యం ప్రకారం అన్నీ తిథుల్లో సూర్యచంద్ర గ్రహాల ఆధిపత్యం ఉంటుంది. సూర్యచంద్రులతోనే అమావాస్య, పౌర్ణమి ఏర్పడుతుందనే విషయం అందరికీ తెలుసు. ఇలా గ్రహాల్లో సూర్యునికి తర్వాత ఆధిపత్యం వహించే చంద్రుడు సకల భోగాలను ప్రసాదిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

అమావాస్య యోగం, పౌర్ణమి యోగం, గజకేసరి యోగం, గురుచంద్ర యోగం, చంద్రమంగళ యోగం, చంద్రాది యోగాలను చంద్రుడు ప్రసాదిస్తాడు. మన జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే తప్పకుండా మంచి యోగ ఫలాలను ప్రసాదిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

శాంతి, ప్రశాంతత, తృప్తి, కరుణ, ప్రేమ, వినయం, విధేయతను ప్రసాదించే చంద్రుడు.. ఆయన ఆధిపత్యంతో జాతకులు కళ, రచన, యానిమేషన్, గ్రాఫిక్స్, విదేశీయానం, షిప్పింగ్, మనోతత్త్వం వంటి రంగాల్లో రాణిస్తారు.

చంద్రగ్రహానికి చెందిన తేదీలు, నక్షత్రాల్లో జన్మించిన జాతకులు అన్ని రంగాల్లో ధీటుగా రాణిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీరు చంద్ర లగ్నంలో జన్మించిన వారైతే విద్యారంగంలో రాణిస్తారు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. విదేశీయానం, ఆర్థిక వృద్ధి, పుణ్యఫలం, వృత్తి, వ్యాపారాల్లో రాణింపు వంటి శుభఫలితాలుంటాయి.

చంద్రుని అనుగ్రహం కోసం పౌర్ణమి వ్రతం చేపడితే మంచి ఫలితం ఉంటుంది. సత్యనారాయణ పూజ చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. పౌర్ణమి రోజున సాయంత్రం ఇంట పూజ చేసి ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఉత్తమం. ఇంకా అమ్మవారి ఆలయాల్లో భక్తులకు, పేదలకు నేతి అన్నం, పెరుగు అన్నం, పండ్లు కలిపి అన్నాన్ని ఇవ్వడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML