What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 24 December 2013

అద్వైతం :: అద్వైత వేదాంతం ( సంస్కృతం : अद्वैत वेदान्त ); వేదాంతానికి చెందిన ఒక ఉపశాఖ లేదా తాత్విక వాదం

అద్వైతం


అద్వైత వేదాంతం ( సంస్కృతం : अद्वैत वेदान्त ); వేదాంతానికి చెందిన ఒక ఉపశాఖ లేదా తాత్విక వాదం. హిందూ తత్వశాస్త్రాల ప్రకారం దీని అర్థం "వేదముల లక్ష్యము".[1] వేదాంతాల ఇతర ఉపశాఖలు ద్వైతం మరియు విశిష్టాద్వైతం. అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక.[2] ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.[3]
చరిత్ర
ఉపనిషత్తులలో జీవుడు, బ్రహ్మం, జగత్తును గురించి గురుశిష్యుల నడుమ చర్చలుగా వ్రాసి ఉన్నాయి[4]. ఈ ఉపనిషత్తులలో అనేక చోట్ల సాక్షాత్తు అద్వైతం అన్న పదం వాడకపోయినా జీవుడు బ్రహ్మ ఒకటే అన్న విషయాన్ని ప్రస్తావించబడినది. సుమారు క్రీ. శ. 600 లో రచించిన బృహదరణ్యకోపనిషత్ లో అద్వైతసూత్రాలు చాలా కనబడతాయి. క్రీ. శ 6 వ శతాబ్దంలో జీవించిన గౌడపాదులు ఈ ఉపనిషత్తుల సారం అద్వైతం అని వారు రచించిన మాండూక్య కారికలో చెప్పారు[5]. అద్వైతం అంటే "రెండవది-లేని" అని అర్థం. బ్రహ్మం, జీవుడు, జగత్ అని మూడు విషయాలు లేవు. ఉన్నదంతా ఒకటే, అది బ్రహ్మమే అని అర్థం. ఆయన శిష్యుడు గోవింద భగవత్పాదులు. వారి శిష్యుడు శంకరాచార్యులు[6].

ముందు గురువులు అద్వైతం గురించి చెప్పినా, శంకరాచార్యులు అద్వైతాన్ని క్రమబద్ధీకరించి, తర్కంతో ఋజువు చేసారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత -- ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయి అన్నారు. వీటికి అన్నిటికీ సమన్వయం చేకూర్చి, వాటి భావం అద్వైతం అని చాటారు. అప్పటి నుండి అద్వైతం బాగా ప్రచారంలోకి వచ్చింది. కేరళ నుండి ఉత్తరభారతదేశం వరకూ ప్రయాణించి చాలా మంది వేదాంతులతో వాదించి అద్వైతాన్ని నిలబెట్టారు[7]. దేశం నలుమూలలా మఠాలను స్థాపించి ఆయన శిష్యులైనపద్మపాదులు (తూర్పున పూరి లో), హస్తామలకులు (పడమరన ద్వారకలో), తోటకాచార్యులు (ఉత్తరాన జ్యోతిర్మఠంలో), సురేశ్వరాచార్యులు (దక్షిణంలో శృంగేరి లో) దేశం నలువైపులా మఠాలను ఏర్పరిచారు. ఆ తఱువాత ఆ మఠాలలో ప్రతీ గురువు ఒక శిష్యుడికి ఉపదేశం చేసి గురుపరంపర కొనసాగిస్తున్నారు.
సూత్రాలు
అద్వైతాన్ని క్లుప్తంగా చెప్పే శంకరుని వచనాలు -
బ్రహ్మ సత్యం జగన్మిధ్య
జీవొ బ్రహ్మైవ నా పరః
బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు. - ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది. అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిధ్య కావడమేమిటి? ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా? - ఇందుకు మాయావాదం వివరణ : జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే (అనగా అది యదార్ధమన్నట్లుగానే) ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఇదంతా మిధ్య అన్న జ్ఞానం గోచరమౌతుందో అపుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది.
భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు. ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి? "ఆత్మానాత్మ వివేకం" అనే ప్రకరణ గ్రంధంలో శంకరుడు ఇలా వివరించాడు -
ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?
పూర్వ జన్మ లలోని కర్మ వలన.
కర్మ ఎందుకు జరుగుతుంది?
రాగం (కోరిక) వలన.
రాగాదులు ఎందుకు కలుగుతాయి?
అభిమానం (నాది, కానాలి అనే భావం) వలన.
అభిమానం ఎందుకు కలుగుతుంది?
అవివేకం వలన
అవివేకం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానం వలన
అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.
అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML