What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 31 August 2014

దశకుమార చరిత్ర - కేతన

గ్రక్కున నేత్రయగ్మము కరద్వితయంబున మూసిపట్టి, యా
మిక్కిలి కంటికిన్ తనదు మిక్కిలి హస్తము మాటుచేసి, యిం
పెక్కెడు బాలకేళి పరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునన్ బొలుచు దంతిముఖున్ గొలుతున్ బ్రసన్నుగాన్.
పిల్లలు తల్లిదండ్రుల కళ్ళు మూసి “నేనెవరినో చెప్పుకో” అంటూ ఒక ఆట ఆడుతూ ఉంటారు. అలాగే గణపతి కూడా తన తండ్రియైన పరమశివుని వెనుకకు వెళ్ళి , తన రెండు చేతులతోనూ ఆయన రెండు కళ్ళనూ మూసిపట్టాడట!అయితే, ఆ తండ్రి అందరు తండ్రులవంటివాడు కాదుకదా!ఆయనకు మూడు కళ్ళు! మరి ఆ మూడవకన్ను(మిక్కిలి కన్ను) ఎలా మూయటం?అది గణపతికి ఒక సమస్య కానేలేదు.తన తండ్రికి మిక్కిలి కన్నుంటే, తనకు మిక్కిలి హస్తం (తొండం) ఉంది! దానితో మూడవ కంటిని మూసి ఆదిదేవునికి ఆనందం కలిగించాడట!ఇంత ముద్దుగా బాల్యక్రీడ నెరపిన గజముఖుడు నాకు ప్రసన్నుడు కావటానికి ఆయనను సేవిస్తాను.
-దశకుమార చరిత్ర - కేతన

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML