నిత్య పూజలలో సంకల్పం చేస్తూ వుంటారు. సంకల్పములో - ఆది నుండి, అంటే అధ్య బ్రహ్మణం లగాయితు, వర్తమానం వరకు గడచిన కాల మానాని ప్రస్తావిస్తారు. అనునిత్యం పూజారంభంలో గోత్ర నామలతో సంకల్పం చేస్తారు:
అద్య బ్రాహ్మణ, ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతర, అష్టావింశత్ మహాయుగే, కలి యుగే, ప్రధమ పాదే ..... అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్ర మానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే, శ్రీ సర్వధారి నామ సంవత్సరే, ఉత్తరాయణే / దక్షిణాయణే, వసంత/గ్రీష్మ/వర్ష/శరధ్/హేమంత/
సృష్టికి ఆది ఐన బ్రహ్మ మొదలిడుకుని, ద్వితీయ పరార్ధ, శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో, అష్టావింశిన్ (28) మహాయుగంలో, కలి యుగ ప్రధమ పాదంలో, ....
ఇలా మానవులను పరాత్పరుడితో కాలంతో అనుభందం చేసారు. ఒక్క భారతీయ పరంపరలో తప్పితే, ప్రపంచ ఇతిహాశంలో మరే పరంపరలో ఇంత పరీవ్యాప్తమైన భారీ కాల మనాలను ప్రస్తావించిన వైనాలు లేవు.
షట్ కాల చక్రం
మనం ఆచరించే ఆరు కాలాలు - 1. సంవత్సరం; 2. ఆయనం; 3. ఋతువు; 4. మాసం; 5. పక్షం; 6. దినము;
పంచ కాల స్వరూపాలు
భారతీయులు అనాదిగా ఆచరిస్తున్న కాల స్వరూపాలు - చాంద్రమాన సంవత్సరం; సౌరమాన సంవత్సరం; సావన మాన సంవత్సరం; నక్షత్ర మాన సంవత్సరం, బృహస్పత్య సంవత్సరం.
చాంద్ర మాన సంవత్సరం - శుక్ల పాడ్యమి మొదలు పౌర్ణమి; కృష్ణ పాడ్యమి మొదలు అమావాస్య - ఈ విధంగా 12 పౌర్ణమిలు, 12 అమావాస్యలు కలిగి వుండేది చాంద్ర మాన సంవత్సరం. ఇందులో 12 మాసాలుంటాయి.
No comments:
Post a Comment