శబ్ద బ్రహ్మ
భారతీయ సనాతన యోగ సంప్రదాయ రీతులలో శబ్ద బ్రహ్మను గురించిన విషయాలను వివరించే ఈ కథను శివపురాణం ఉమా సంహితలో పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి చెప్పాడు. వీణ, వేణువు లాంటి వాద్య ధ్వనుల గొప్పతనం కూడా ఇందులో ప్రస్ఫుటమౌతుంది. శబ్ద బ్రహ్మను తెలుసుకోవటానికి సాధకుడు భక్తి శ్రద్ధ, సూక్ష బుద్ధి, శుద్ధమైన అంతంకరణం కలిగిన వాడుగా వుండాలి. అంతేకాక నిత్యం ధర్మానికి కట్టుబడి వుండి జీవితాన్ని సాగించే వాడుగా కూడా ఉండాలి. అలాంటి వాడే శబ్ద బ్రహ్మను గురించి తెలుసుకోగలడని పరమేశ్వరుడు పార్వతితో చెప్పాడు. ఈ శబ్దబహ్రను తెలుసుకునే ప్రక్రియను వివరిస్తూ ఏమాత్రం ధ్వనులు లేకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో యోగవేత్త చక్కని ఆసనం మీద కూర్చుని ఎదురుగా దృష్టిని మరల్చే దీపం లాంటివి కూడా ఏవీ లేకుండా చూసుకొని ప్రాణాయామం చేసి మనస్సును ధారణ చెయ్యాలి. చూపుడు వేళ్ళతో చెవులను మూసి కొద్దిసమయంపాటు నొక్కి పెట్టి వుంచితే అప్పుడు చెవుల లోపల నుండి భగభగమండే అగ్నిశబ్దాన్ని పోలిన శబ్దం వినిపిస్తుంది. ఈ యోగాన్ని ఇలా అభ్యసిస్తే జ్వరం లాంటి రోగాలు శీష్టంగా నశిస్తాయి. సంధ్యా సమయం తర్వాత తిన్న ఆహారం త్వరగా జీర్ణమౌతుంది. ఎవడు ఈశ్వర స్వరూపాన్ని కొద్ది సమయం పాటైనా ఏకాగ్రతతో ధ్యానిస్తాడో అతడు నిత్యం ఆరోగ్యంగా ఉంటాడు. ఇలా ఏకాగ్రతతో ధ్యానం చేసేటప్పుడు దట్టమైన వర్షాకాల మేఘాలతో నిండిన ఆకాశం నుండి వచ్చే పిడుగుల శబ్దాన్ని పోలిన శబ్దం వినిపించటం మొదలు పెట్టిన కొద్ది సేపటికి మెల్లమెల్లగా అంతరించి పోవటాన్ని కూడా సాధకుడు గమనించవచ్చు. ఇలా యోగాభ్యాసాన్ని చెయ్యడాన్నే శబ్దబ్రహ్మను ఆరాధించటమని అంటారు. శబ్దబ్రహ్మను తెలుసుకున్న తర్వాత సాధకుడు సకల బంధాలను తృణ ప్రాయంగా భావించాలి. అలా సాధన చేస్తే పరబ్రహ్మను ఆ సాధన ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎంతో పౌర లౌకిక జ్ఞాన సంపార్జనకు దోహదం చేస్తుంది. పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్న మానవుడు జన్మబంధాల నుండి విముక్తిని పొందుతాడు. నిద్ర, సోమరితనం అనేవి యోగ సాధనకు పెద్ద విఘ్నాలు శత్రువులు లాంటి ఈ లక్షణాలను సాధకుడు ప్రయత్న పూర్వకంగానే జయించి తీరాలి. అలా జయించినప్పుడే ముందు శబ్ద బ్రహ్మను అభ్యసించటానికి వీలవుతుంది. నూరు సంవత్సరాలు వయస్సు గల వృద్ధులు కూడా ఈ యోగాన్ని అభ్యసించి జవ సత్వాలను పొందవచ్చు శబ్ద బ్రహ్మ పదార్ధాలలోని కంపనం వల్ల పుట్టే శబ్దం మాత్రం కాదు. దానిని ఎలా వుంటుందో మామూలుగా నోటితో చూపించటం కూడా ఎవరి వల్లా కాదు. అది ఓంకారం కానీ మంత్రం కానీ చివరకు బీజాక్షరం కూడా కానీ కాదు. అయితే ఈ సందర్భంలోనే పరమేశ్వరుడు తొమ్మిది రకాలైన శబ్దాలను గురించి వివరిస్తూ వాటి ప్రాధాన్యం ఎలాంటిదో పార్వతీ దేవికి వివరించి చెప్పాడు. తొమ్మిదింటిలో మొదటిది ఫ్రోషం అనే శబ్దం అది అంతః కరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇది ఎంతో ఉత్తమమైన నాదం లాంటిది. దీనివల్ల వ్యాధులు నయమవుతాయి. రెండవ నాదం కాంశ్యం ఈ నాదం ప్రాణుల గతిని స్థంభింపచేస్తుంది. అది విషాన్ని సకల భూత దోషాలను గ్రహదోషాలను నివారిస్తుంది. మూడవశబ్దం శృంగం. ఇది ద్వేషించే వారి వినాశం కోసం, శత్రు సంహారం కోసం ఉపయుక్తమవుతుంది. నాల్గవది ఘంటానాదం. ఈ నాదాన్ని సాక్షాత్తుగా పరమేశ్వరుడే చేస్తాడుట. ఇది దేవతలందరికీ ఎంతో ఇష్టమైన నాదం. ఈ శబ్దాన్ని విన్న యక్షులు, గంధర్వులు ఆ సమయంలో ఎదురుగా ఉన్నవారు ఏది కోరితే అది చేస్తారట. అయిదో శబ్దం వీణానాదం. దీన్ని యోగులు సర్వదా వింటూనే వుంటారు. ఈ వీణానాదం విన్నందువల్ల విన్నవారికి జీవితంలో ఎంతో ముందుకు చూసే శక్తి కలుగుతుంది. ఆరవది వంశీనాదం. ఈ నాదం నిత్యం వినేవారికి పంచ సూక్షతత్వాల జ్ఞానం లభిస్తుంది. ఏడవ శబ్దమైన దుందుభి శబ్దాన్ని వినేవాడు వృద్దాప్యం నుండి విముక్తుడవుతాడు. ఎనిమిదో శబ్దం శంఖ శబ్దం. ఈ శబ్దాన్ని నిత్యం విన్న యోగి తనకు నచ్చిన రూపాన్ని పొందగలడు. ఇక తొమ్మిదవది మేఘానాదం. దీన్ని ప్రతినిత్యం వింటూ సాధన చేసిన యోగికి ఆపదలనేవి కలగవు. అలాగే బ్రహ్మ స్వరూపమైన ఝంకారాన్ని ఎవరు ఏకాగ్రతతో నిత్యం ధ్యానిస్తారో వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇలా పౌరాణికంగా శబ్ద స్వరూపాలు తొమ్మిది విధాలుగా వుంటాయని ఈ తొమ్మిది విధాల శబ్దాలు ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో ఈ శబ్దాలను సాధన చేసిన యోగసాధకుడు ఒక్కొక్క విధమైన జ్ఞానాన్ని, మేలును పొందవచ్చని పరమేశ్వరుడే పార్వతీ దేవికి వివరించినట్లు శివపురాణంలో మనం చూడవచ్చు. ఈ తొమ్మిది శబ్దాలు కాక అంతకుముందు చెప్పిన శబ్ద బ్రహ్మను సాధన చెయ్యటం వల్ల కూడా యోగ సాధకుడు మేలును పొందుతాడన్నది శివపార్వతుల సంభాషణలోని ప్రధాన సారాంశం.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
No comments:
Post a Comment