What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 31 August 2014

ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టారు?.

ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టారు?........................

అన్ని విజ్ఞానాలను ప్రపంచానికి అందించిన భారతీయులే అన్నింట్లో తప్పులు చేస్తుంటారని ఓ అపవాదు. నిజమే మన జ్ఞానం మనకు గొప్పకాదు. అందుకే పెద్దగా పట్టించుకోం. అది కామసూత్ర అయినా, వాస్తు శాస్త్రమైనా మీరు నిత్యం ముహుర్తాలు చేస్తూ పనులు చేసుకోనక్కర్లేదు కానీ కొన్ని ప్రాథమిక విషయాలను పాటించడం మాత్రం చాలా అవసరం. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న ముఖ్య విషయం ఏంటంటే… ఇంట్లో బీరువాను ఏ వైపున ఉంచాలనేది! మనకు జీవితంలో అతి ముఖ్యమైనది అనుబంధాల తర్వాత డబ్బే. ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే కొన్ని సార్లు అది అనుబంధాలకు మించిన ప్రాధాన్యం కూడా తీసుకుంటుంది. మరి మహాలక్ష్మి మన ఇంటికి నడిచిరాకపోయినా మన సొమ్ము మనకు అక్కరకు రావాలంటే బీరు ఉంచే స్థలం చాలా ప్రధానం.
వాస్తులో ఏ గది ఎటు ఉండాలో నిర్దేశించినట్లే, బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్ణయించారు. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో అసలు బరువు ఉండకూడదని చెప్పినట్లే, కొన్ని చోట్ల బరువు ఉంటే మంచిదని కూడా సూచించారు. అయితే, అన్నటికీ ఒకటే సూది మందు అన్నట్లు… నైరుతిలో బరువుండాలి కాబట్టి బరువైన బీరువాను అక్కడ పెట్టాలనుకుని అందరూ అక్కడ పెట్టేస్తుంటారు. అది నిజం కాదు.
బీరువాను ఉత్తర వాయువ్యవంలో ఉంచాలి. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది. చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి. కనుక వాస్తు సూచనలను అనుసరించి, డబ్బు నగలు భద్రపరచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో (అంటే పశ్చిమానికి-ఉత్తరానికి మధ్య ఉండే మూలలో) ఉంచాలి. బీరువా దక్షిణ ముఖం చేసి పెట్టాలి. అది శ్రేష్టం. అంటే మనం బీరువా తెరిచినపుడు మనం ఉత్తరం వైపు చూస్తుండేలా ఉండాలి.ఈ సూచన పాటించినట్లయితే డబ్బు నష్టం జరగదు. ధన ప్రవాహానికి ఆటంకం కలక్కుండా వస్తూ ఉంటుంది.
అలా కుదరకపోతే బీరువాను ఉత్తర దిక్కు మధ్య కూడా ఉంచొచ్చు. ఉత్తర దిక్కుకు బుధుడు అధిపతి. బుధుడు సంపదలకు అధిపతి కనుక బీరువాను ఉత్తర దిక్కు మధ్యభాగంలో ఉంచినా కూడా మంచిదే. బీరువా మాత్రం దక్షిణ ముఖమే చూస్తూ ఉండాలి.
ఎట్టి పరిస్థితుతుల్లోనూ బీరువా నైరుతి మూలలో ఉంచొద్దు. అలా చేస్తే మనకు ఎంత డబ్బు వచ్చినా అది చాలదు. వచ్చింది వచ్చినట్టే పోతుంటుంది. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి నిత్యం దక్షిణ రూపంలో కుప్పలుతెప్పలుగా సంపదలు వచ్చిపడుతుంటాయి. ఆ వెంకన్న హుండీ దేవాలయంలో ఉత్తర దిక్కు మధ్యభాగంలో ఉంది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML