విశ్వ వినాయకుడు
వినాయకుడు.. విఘ్నేశ్వరుడు.. గణపతి.. గణేశుడు.. ఈ పేర్లన్నీ మనకు తెలిసినవే కదూ! మరి ఈ పేర్లు చూడండి.. సాగ్ గి దాగ్ పో,మార్‌చెన్, కాంగి-టెన్, షో-టెన్, ఫ్రా ఫికానెట్.. ఇవీ గణనాథుడి పేర్లే!!
విశ్వ నాయకుడు గణపతి.. టిబెట్, జపాన్, థాయ్‌లాండ్, కంబోడియా, బర్మా, ఇండోనేషియా, మలేషియా..వంటి దేశాల్లో పూజలందుకున్నవాడే. కాలక్రమంలో వేర్వేరు కారణాల వల్ల ఆయా దేశాల్లో వినాయకుడి ఆరాధన మరుగున పడింది. మరి కొన్ని దేశాల్లో అలనాటి ఆనవాళ్లు మాత్రం రేఖామాత్రంగా మిగిలాయి.
ఎక్కడెక్కడ(కు) ఎలా?
వినాయకుడి ఆరాధన మన దేశం నుంచి ఇతర దేశాలకు ప్రధానంగా బౌద్ధం ద్వారా, కొన్నిచోట్ల జైన మతం ద్వారా వ్యాపించింది. టిబెట్‌లో వినాయకుడిని సాగ్ గి దాగ్ పొ, మార్ చెన్‌గా వ్యవహరిస్తారు. గణాలకు అధిపతి అయిన అరుణ దేవుడు అని దీని అర్థం. దీనికి అనుగుణంగా టిబెటన్ల వినాయకుడు ఎర్రటి ఎరుపురంగులో ఉంటాడు. అందుకే ఈ స్వామిని ‘మహారక్త’గా కూడా వ్యవహరిస్తుంటారు. అలాగే.. టిబెటన్లు సంపదనిచ్చే ఐదుగురు దేవుళ్లను కొలుస్తారు. టిబెటన్ పురాణాల ప్రకారం వారు జంభాలాలుగా పిలుచుకునే ఈ దేవుళ్లందరూ బుద్ధుడి అవతారాలే. ఈ ఐదుగురిలో ‘అరుణ జంభాలా’గా వ్యవహరించే స్వామి గణేశుడి అవతారమేనని కొందరి నమ్మకం. మన శివుడు వారి పురాణాల ప్రకారం మహాకాల. ఆయన కుమారుడి కోశాగారానికి వినాయకుడు (మహారక్త లేదా సాగ్ గి దాగ్ పొ) అధినాయకుడు. తనను ప్రార్థించినవారందరికీ సంపదను ఇస్తుండడంతో ఆగ్రహించిన మహాకాల.. ఆయన శిరస్సును ఖండించాడని, ఆ తర్వాత ఏనుగు తల అతికించాడని ఒక కథనం. ఇక.. జపాన్‌లో గణేశుడిని కాంగి-టెన్‌గా కొలుస్తారు. వినాయకుడికి వారు పెరుగు, తేనె, పిండితో తయారుచేసిన రొట్టెలను సమర్పిస్తారు. జపనీయులు గణేశుడిని ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు. గణబచి, వినాయక -టెన్, బినాయక-టెన్, గణపతెయ్, జోబి-టెన్, దైషో కాంగి-టెన్, కాంగి జిజాయ్-టెన్.. అందులో మచ్చుకు కొన్ని. 1832 నాటికి జపాన్‌లో వినాయకుడికి దాదాపు 131 ఆలయాలు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. థాయ్‌ల్యాండ్‌లో గణేశుడిని ఫ్రా ఫికనేసువాన్‌గా కొలుస్తారు. అదృష్టానికి, విజయానికి ప్రతీకగా.. అడ్డంకులను తొలగించే దేవుడిగా భావిస్తారు. థాయ్‌వ్యాప్తంగా వినాయకుడికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రధానమైనది.. సెంట్రల్ బ్యాంకాక్‌లోని రాయల్ బ్రాహ్మిన్ టెంపుల్. జావాలో గణనాథుడిని జ్ఞానమిచ్చే దేవుడిగా పూజిస్తారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుడి చిత్రాలు చిరపరిచితమే. అఫ్గానిస్థాన్, చైనాల్లో సైతం గణేశుడి ఆరాధన ఉంది. అఫ్గానిస్థాన్‌లో 5 నుంచి 7వ శతాబ్దకాలం నాటివిగా భావిస్తున్న కొన్ని గణేశ విగ్రహాలున్నాయి. ఇక ఇప్పుడు.. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా అనేక దేశాల్లో ఉంటున్న హిందువులు వినాయకుడిని స్థానికులకు పరిచయం చేస్తున్నారు.

No comments:
Post a Comment