What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 31 August 2014

తులసిని నమస్కరిస్తూ చదువవలసిన శ్లోకం:

తులసిని నమస్కరిస్తూ చదువవలసిన శ్లోకం:
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః !
యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం !!
'తులసి మూలంలో అన్ని తీర్థాలు, మధ్యలో సర్వ దేవతలు, కొనలలో అన్ని వేదాలు కలిగిన తులసీ! నీకు నమస్కారం'.
పూజార్ధం తులసి దళాలను కోసేటప్పుడు క్రింది శ్లోకాన్ని చదవాలి. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కలనుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు.
పూజ కోసం తులసి దళాలను తుంచేటప్పుడు ఈ క్రింది శ్లోకం చదవాలి.
తులస్యమత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే !
కేశవార్ధం లునామిత్వాం (విచన్వామి) వరదాభవ శోభనే !!
"తులసీ! నీవు అమృతముగా పుట్టిన దానవు. ఎల్లవేళలా కేశవునకు ప్రీతి పాత్రురాలవు. కేశవుని పూజకై నిన్ను త్రుంచుతున్నాను. ఓ శుఖ స్వరూపిణీ! నాకు నీవు వరదురాలవగుము."
తులసిని స్త్రీ కోయరాదు. పురుషుడే కోయాలి. పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML