What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 27 August 2014

పూజగదిలో తాత ముత్తాల ఫోటోలు పెట్టడం సరేనా?

పూజగదిలో తాత ముత్తాల ఫోటోలు పెట్టడం సరేనా?

పూజగదిలో మరణించిన తాత ముత్తాతల ఫోటోలు పెట్టడం సరికాదని వాస్తు నిపుణులు అంటున్నారు. చాలామంది పెద్దలకు గౌరవం ఇచ్చే భావనతో పూజగదిలో మరణించినవారి ఫోటోలు పెడుతుంటారు.

కానీ అవి మన దృష్టిని, ఆలోచనలను మరల్చడమే కాకుండా బాధాకరమైన జ్ఞాపకాలను తెప్పిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. అందుచేత తాతముత్తాల ఫోటోలను హాలులు కాస్త ఎత్తుగా లైట్ల డెకరేషన్‌తో అమర్చుకోవడం మంచిది.

అలాగే పూజ గదిలో గంటను ఏర్పాటు చేయడం సరికాదు. పూజ గది ఆలయం కాదు. అది మన వ్యక్తిగత ధ్యానానికి, పూజకు ఉద్దేశించింది కనుక పెద్ద శబ్దాలు లేకుండా ఉండటం మంచిది. పూజ గదిలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను అక్కడ దాచడం సరికాదు. పూజ గది కప్పు కొద్దిగా కిందకి ఉండేలా చూసుకోవాలి.

పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆ గదికి ఎప్పుడూ రెండు తలుపులు ఉన్న ద్వారాన్నే ఎంచుకోవాలి. అలాగే పూజ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి. అలాగే పూజ గదికి లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం సులభమవుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML