What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 29 August 2014

వినాయక చవితి సందర్భముగా మన విఘ్నేశ్వరుని గురించి కొంత సమాచారం తెలుసుకుందాం :

వినాయక చవితి సందర్భముగా మన విఘ్నేశ్వరుని గురించి కొంత సమాచారం తెలుసుకుందాం :
==================================================
☻ వినాయకునికి తొండము ముఖ్యము. కుడి వైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని లక్ష్మీ గణపతి అంటాము.
☻ తొండము లోపలి వైపుకు ఉన్న గణపతిని తపో గణపతి అని అంటాము.
☻ తొండము ముందుకు ఉన్న గణపతి కి పూజలు చేయరాదు.
☻ గణపతికి ఒక దంతము విరిగి ఉంటుంది. విరిగి ఉన్న ఆ దంతము చేతితో పట్టుకొని ఉన్న గణపతిని వృద్ధ గణపతి అంటాము. ఈ గణపతికి పూజలు చేయరాదు.
☻ గణపతికి వాహనము ఎలుక. కనుక మనము పూజించే ప్రతిమ లో గణపతి విడిగా.. ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగముగా ఉండాలి.
☻ గణపతికి యజ్ఞోపవీతము ఉండవలెను. పామును యగ్నోపవీతముగా ధరించి ఉన్న గణపతిని పూజించవలెను.
☻ మనము గణపతి ప్రతిమకు రంగులు ఉన్నాయా ??? అని రంగులకు ఆకర్షింప పడకూడదు. గణపతి ముఖము లో చిరునవ్వు ఉండాలి. మనము పూజించే గణపతి ప్రతిమ చిరునవ్వు ఉన్న గణపతి గా ఉండాలి. అందుకే మనం అంటాము.... "ప్రసన్న వదనం ధ్యాయేత్" అని.. కనుక, ప్రసన్న వదనముతో నవ్వుతూ ఉండాలి.
☻ గణపతి ని రెండవ రోజు (పూజ పక్కరోజు) కదిలించి తీయవచ్చు. ఒకవేళ పక్క రోజు శుక్రవారం లేదా మంగళవారం అయితే అటుపక్క రోజు (3వ రోజు) కదిలించి తీయవచ్చు.
☻ గణపతికి చతుర్భుజాలు ఉండాలి. ఒక చేతిలో లడ్డు. మరో చేతిలో కమలము. మరో చేతిలో శంఖము. మరో చేతిలో ఏదైనా ఆయుధము ఉండాలి.
------------------------------------------------------------------------------------------
▬▐▬▐☻ గణపతి గంగమ్మ కు ఇచ్చిన వరం గురించి తెలుసుకుందాం.
=============================================
☻ గంగమ్మ అడుగుతుంది వినాయకుడిని... ఏమయ్యా !!! ఎప్పుడూ పార్వతి ఒడిలో మాత్రమే కూర్చోని ఉంటావు... నా ఒడిలో కుర్చోవా ?? అని....
☻ అప్పుడు వినాయకుడు ఒక వరం ఇస్తారంట గంగమ్మకు!! సరేనమ్మా !! ప్రతి సంవత్సరం... నా జన్మ దినమున నీ నుండి తీసిన బంక మట్టితో ప్రతిమలు చేసి నన్ను పూజించి తిరిగి నీలో కలుపుతారు. కనుక నేను నీలోనే లయమవుతాను... కనుక నా జన్మ దిన సందర్భమున నేను నీ వద్దకు వస్తాను... అని చెప్తారు.
▬ కనుకనే.. మనము... మట్టితో మాఆ.........త్రమే తయారు చేసిన గణపతి ప్రతిమను తయారు చేసి పూజించి తిరిగి గంగలో కలిపితే... మనం వినాయకుని వరం తీర్చిన/పాటించిన వారము అవుతాము.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML