మంత్రజపం ఎందుకు చేయాలి?
మననం చేయడం వలన కాపాడేది మంత్రం.. మనస్సుకు చాంచల్య స్వభావం(ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటూనే వుంటుంది) ఈ చెంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది. ఈ మానసిక వృత్తులు అన్ని ఒకచోట చేరినప్పుడే అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది. మంత్రానికి అంతఃకరణానికి సంబందం వుంది.
మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. నాడీ శుద్ధి జరుగుతుంది. కుండలిని శక్తి జాగృతమౌతుంది. వ్యాధులు దూరమౌతాయి. మంత్ర సాధన వల్ల దేవతలు తమకు తామై దిగివస్తారు. నానావిధ సిద్దులు సిద్దిస్తాయి. మంత్రజప సాధన వలన సిద్దులు కలుగుతాయని యోగాధర్శనం చెబుతుంది. ఎందఱో మునులు, ఋషులు ఈమంత్రజపం వలనే సిద్దులు సాధించారు. సాధన వలన అధర్మపరుడిని ధర్మపరుడిగా, దానవుణ్ణి మానవునిగా, పాషండుని సదాచార పరయనునిగా, దుఃఖ వంతుడిని, సుఖవంతుడిగా, కోపిని శాంతునిగా, ధరిద్రుడిని ధనవంతుడిగా, లోభిని త్యాగిగా, కాముని, జితెంద్రియునిగా, నాస్తికుడిని ఆస్తికుడిగా, తెజోవిహీనుడిని తేజోవంతునిగా, రోగిని ఆరోగ్యవంతునిగా, చేస్తుంది. అంధకారం నుండి ప్రకాశం వైపుం మృత్యువు నుండి అమృతంవైపు, నరకం నుండి స్వర్గం వైపు, హింస నుండి అహింస వైపు, దిర్భుద్ది నుండి సద్బుద్ధి వైపు, కొనిపోతుంది. మంత్రమే దేవతా రూపాన్ని పొంది అత్మసక్షాత్కారాన్ని కలిగిస్తుంది.
ఇందుకోసమే నేను నిత్యం జపించండి అని పదేపదే చెప్పడానికి కారణం. ఇకనైనా మీరు క్రమం తప్పకుండా నిత్యం మంత్రజపం చేయండి.. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సకల మనోరధాలు, సిద్దిస్తాయి..
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
No comments:
Post a Comment