హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం ప్రాచీనకాలం నుంచే హోమాలను నిర్వహించుకోవడం ఒక ఆచారంగా అమలులో వుంది. దోషాలు, శాపం నుంచి విముక్తి పొందడం కోసం, సంతోషంగా జీవితాన్ని గడపడం కోసం, కష్టనష్టాలను అధిగమించేందుకు, సంతానం కలగడం వంటి రకరకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి హోమాలను నిర్వహించుకుంటారు. పూర్వం దేవతలు, మహర్షులు, మునులు కూడా హోమాల ద్వారా తమ సమస్యలను దూరం చేసుకునేవారు.
హోమాలలో కూడా చాలా రకాలు వున్నాయి. ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క ప్రత్యేక ఫలితాలు అందుతాయి. పూర్వకాలంలో చెరుకు, అరటిపండ్లు పండింటే పంట పొలాలను ముందుగా ఆవు మేతలతో శుభ్రపరిచి హోమాలను నిర్వహించడం ఆనవాయితీగా వుండేది. రానురాను కాలక్రమంలో ఇప్పుడు ఆ పద్ధతి కేవలం కొద్దిచోట్ల మాత్రమే చూడ్డానికి దొరుకుతోంది. హోమాలను దైవంతో, ఆధ్యాత్మికంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తిగా నిర్వహిస్తే.. దోషాలు నశించడమే కాకుండా కోరుకున్నవి కూడా లభిస్తాయి.

హోమాలలోని రకాలు... వాటి ఫలితాలు...
హోమాలలో చాలా రకాలు వున్నప్పటికీ అందులో ముఖ్యమైనవి ఐదు వున్నాయి. ఇవి ఎంతో ఉత్తమమైనవి కూడా. వీటిని ఆధ్యాత్మికంగా నిర్వర్తిస్తే అనుకున్నవి తక్షణమే జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు.
1. ద్రవ్యయజ్ఞం : ద్రవ్యమంటే ధనం. మనం చేసే పనులు న్యాయంగా వుంటూ అందులో వున్న ధర్మాలను పాటిస్తూ ఆదాయాన్ని సంపాదించుకోవాలి. ఆ విధంగా సంపాదించిన ధనాన్ని ధర్మకార్యాల (దానం ఇవ్వడం, దేవుని మార్గంలో డబ్బు ఖర్చు పెట్టడం వంటివి) కోసం వెచ్చించాలి. అప్పుడే ఈ యజ్ఞ ఫలితం లభిస్తుంది.
2. తాపయజ్ఞం : ఎటువంటి ఆలోచనలను లేకుండా మనలో వున్న జ్ఞాన అగ్నితో ఆత్మను తపింప చేసుకోవాలి. ఆత్మను పునీతం, తేజోవంతం చేసుకోవడం కోసమే ఈ పవిత్రమైన తాపయజ్ఞాన్ని ఆచరించాలి.
3. స్వాధ్యాయయజ్ఞం : లోకంలో వున్న ఏ విద్యనైనా అధ్యయనం చేసి, ఆ విద్యను అర్థం చేసుకుని లోకకల్యాణం కోసం వినియోగించడమే ఈ స్వాధ్యాయయజ్ఞం.
4. జ్ఞానయజ్ఞం : అసలు మీ మానవ జన్మం ఏంటి? మానవుడు పుట్టడంలో అంతర్యం ఏంటి? మానవుడు ఎందుకు పుట్టాడు? ఏం సాధించాలని ఈ లోకంలో జన్మనెత్తాడు? అతని వల్ల ఈ లోకానికి కలిగే ప్రయోజనాలేంటి? వంటి ప్రశ్నలను ఒకసారి సంధించుకుని, ఆధ్యాత్మికంగా ధ్యానించ ఆత్మ దర్శనం అనుభవం పొందడానికే ఈ జ్ఞానయజ్ఞాన్ని ఆచరిస్తారు.
5. సంశితయజ్ఞం : తమలో వున్న హావభావాలను, కామక్రోధాలను అదుపులో వుంచుకుని, వాటిని జయించి.. నియమనిబంధనల అనుసారం కర్మ ఆచరణ చేయడం కోసం ఈ సంశితయజ్ఞాన్ని ఆచరించాల్సి వుంటుంది.
ఈ విధంగా యజ్ఞాలను అనుసరించి తమలో వున్న లోపాలను, పాపాలను సవరించుకుంటూ, దోషాల నుంచి విముక్తి పొంది సంతోష జీవనాన్ని గడపవచ్చు.

No comments:
Post a Comment