What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 11 June 2014

శత్రువు నీ కన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే - భగత్‌సింగ్‌

‘శత్రువు నీ కన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే’ - భగత్‌సింగ్‌ను వీరోచిత పథం వైపు నడిపించిన మాటలివి. ‘పోరుబాట పట్టాక ఒక్కటే అనుకున్నా. దేశం నలుమూలలా ‘విప్లవం వర్ధిల్లాలి’ అన్న నినాదం మార్మోగాలి. అందుకోసం నా జీవితాన్ని త్యాగం చేశా. ఇప్పుడు నేను జైలు గోడల మాటున ఉన్నా. అదిగో... కోట్లాది నా దేశీయుల కంఠాల్లోంచి ఆ ప్రతిధ్వనులు మిన్నుమన్నుల్ని ఏకం చేస్తున్నాయి. ఇంతకన్న ఏం కావాలి నా చిన్ని జీవితానికి’ జైల్లో ఉన్నప్పుడు భగత్ పలికిన మాటలివి.
జె.పి.సాండర్స్‌ హత్యకి కారణం భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌ దేవ్‌లనే ముగ్గురు విప్లవకారులని తెలిసి, వాళ్లమీద హత్య నేరం మోపింది తెల్లవాళ్ల ప్రభుత్వం. ఎంతో ధైర్యంగా ఆ హత్యా నేరానికి అంగీకరించారు, భగత్‌సింగ్‌. చివరికి 1931 మార్చ్‌ 23వ తేదీన రాత్రి 7 గంటలకి, లాహోర్‌లో, 'ఇంక్విలాబ్‌ జిందాబాద్‌' అని నినదిస్తున్న భగత్‌ సింగ్‌తో బాటు, ఆయన అనుయాయులైన రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను కూడా పంజాబ్‌లోని లాహోర్‌లో వురితీసి సట్లెజ్‌ నదీ తీరంలో హుస్సేన్‌వాలాలో ఆ ముగ్గురు అమర వీరుల పార్ధివ శరీరాలని ఖననం చేశారు. ఆ స్వాతంత్య్ర సమరయోధుల వురివేత వార్త వెలువడిన వెనువెంటనే, ఉత్తరభారత దేశమంతటా, విప్లవానల జ్వాలలు చెలరేగిపోయాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం, తమదయిన దమన నీతితో, 'నితాంత విక్రాంత జ్వాలగా భగభగమనే భగత్‌సింగ్‌ భౌతికకాయంలోని పంచప్రాణ జ్యోతులని ఆర్పగలిగిందేమో కాని, ఆయనలో చెలరేగిన స్వాతంత్య్ర కాంక్షా కీలకలని మాత్రం చల్లార్చలేకపోయింది. ముఖ్యంగా, ఆనాటి యువతరం హృదయాలు భగభగా మండిపోయాయి. కోట్లానుకోట్ల ఎదలలో ఎగసిన మంటలు, ఆ సేతు హిమాచలాన్నీ నిర్దూమధామం చేశాయి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML