What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 11 June 2014

ముఖ్యంగా గణపతి ఆరాధనలో ఒక కథ వున్నది. ఈ కథ వింటే చాలా ఫలితం వుంటుంది

ముఖ్యంగా గణపతి ఆరాధనలో ఒక కథ వున్నది. ఈ కథ వింటే చాలా ఫలితం వుంటుంది. అది మనల్ని క్రమంగా తురీయ స్థితికి తీసుకువెళ్తుంది. త్రిపుటీ భేదనమే త్రిపురా సంహారం. త్రిపుటి అంటే జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము. తెలుసుకొనే వాడు, తెలుసుకొనబడేది, తెలుసుకొనే జ్ఞానం. ఈ మూడూ విడివిడిగా వున్నంత కాలం ముక్తి లేదు. అభేదం అయిపోవాలి. మూడూ ఏకమవ్వడమే ముక్తి. ఈ మూడూ విడివిడిగా వుండకుండా ఏకమైపోవడమే త్రిపురాసుర సంహారం. త్రిపుటి ఏకత్వంలో యే అఖండ ఆనందభావం లభిస్తుందో అదే త్రిపుర సుందరి. కనుక త్రిపురా సంహారం, త్రిపుర సుందరి జరగాలంటే త్రిపురములను అధీనమై వున్న స్వామియొక్క అనుగ్రహం కావాలి. అందుకు ఒక దివ్యమైన గాథని ఇక్కడ వివరించి చెప్తున్నారు.
ఒకప్పుడు త్రిపురాసురులు -కమలాక్షుడు, విద్యున్మాలి, తారకాక్షుడు అని ముగ్గురు రాక్షసులు. విభిన్నపురాణాలలో విభిన్నంగా వుంటుంది త్రిపురాసుర సంహారం. అనేక పురాణాలలోది కలిపి ఒకటి చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. ఆ ముగ్గురూ కలిసి తపస్సు చేసి మాకు మరణములేనటువంటి వరమీయవయ్యా అని బ్రహ్మదేవుడిని అడిగారు. నాకే లేదా వరం నీకెక్కడిస్తాను అన్నాడాయన. శక్తి, విష్ణువు, శివుడు తప్ప నేను కూడా కాలంతో పాటు వెళ్ళిపోవలసిన వాడినే. మరింకేదైనా కోరుకో అన్నాడు. గట్టిగా ఆలోచించి మాకు మూడు పట్టణాలు తయారుచేయించి ఇవ్వు మయుని చేత, ఒకటి స్వర్ణమయం, ఒకటి రజోమయం మూడవది అయోమయం - అయో అంటే ఇనుము అని అర్థం. అని అడిగారు. సత్త్వరజస్తమో గుణాలే అక్కడ చెప్పారు. అలాగే కట్టించి ఇచ్చేశాడట. ఆ పట్టణాలలో తిరుగుతున్నారట. మరికొన్ని కండిషన్స్ చెప్పారు. ఎలాగూ మరణం తప్పదన్నావు కనుక మా మరణానికి మేమే ముహూర్తం పెట్టుకుంటున్నాం. పుష్యయోగం వచ్చినప్పుడు శివుడు ఒక్క బాణంతో మూడు పట్టణాలనూ ఒకే బాణంతో ఒకే కాలంలో కొట్టినప్పుడు మేము మరణించాలి. సాధారణంగా శివుడు తనంత తాను యుద్ధానికి బయలుదేరడం అనేది అరుదు. స్థితి కృత్యం విష్ణువుది. పైగా వీరు శివారాధకులు. తన భక్తులని ఆయన కొట్టడని వాళ్ళ నమ్మకం. మూడు పట్టణాలనూ ఒకే బాణంతో ఒకే కాలంలో కొట్టాలి. అది పుష్య యోగం. ఆ సమయంలో మూడు పట్టణాలూ ఒకే లైన్ లో వుండాలి. బ్రహ్మగారికి అడిగిన వరం పెద్దగా అర్థం కాలేదు కానీ గ్రాంటెడ్ అన్నారు. మయుడు చక్కగా నిర్మాణం చేసి ఇచ్చాడు. అవి వేసుకొని తిరగడం, రకరకాల నగరాలమీద వాటితో పాటు దూకడం, ధ్వంసం చేయడం ఇదీ వాళ్ళ పని. ఇలా ధ్వంసం చేస్తూంటే దేవతలు మొరపెట్టుకోవడం, విష్ణువు దగ్గరికి వెళ్ళడం, వారందరూ పరమేశ్వరుని ప్రార్థించడం, నువ్వు రావలయ్యా అనడం, దానికంటూ ప్రత్యేకమైన రథాన్ని తయారు చేశారు. ఈయన బయలుదేరాడు. పరమేశ్వరుడు. మేరు పర్వతం విల్లు అయింది, వాసుకి వింటి నారి అయ్యాడు. నారాయణుడు బాణమయ్యాడు. భూమి రథమయ్యింది. నాల్గు వేదాలు గుర్రములయ్యాయి. బ్రహ్మదేవుడు సారథి అయ్యాడు. ఓంకారం చేతి కొరడా అయింది. ఛందస్సులు పగ్గములయ్యాయి. అలా బయలుదేరింది దివ్యరథం. ఆ రథం బయలుదేరుతుంటే విశ్వ రథంలో విశ్వేశ్వరుడే రథికుడు. మిగిలిన దేవతలందరూ ఆయనకి ఉపకరణములు. ఒకే బాణం వెయ్యాలి. చాలా కాలం జరిగింది ఈ మహాయుద్ధం. మిగిలిన అసురలతో దేవతలు యుద్ధం చేసి వీక్ అయిపోతున్నారు. త్రిపురాసుర పరిగణాన్ని చూస్తూ వున్నాడు స్వామి. ఎన్ని మార్లు ప్రయత్నించినా సరిగ్గా వచ్చారు అని ఎక్కుపెట్టడానికి చూస్తున్నప్పుడు వాళ్ళు ప్రక్కకి వెళ్ళిపోతున్నారట. ఒకే లైన్ లో వుండడం వాళ్ళ చేతిలో వుంది. అందుకని ఉండకుండా ఎగుడుదిగుడు అవుతున్నారు. ఎగుడుదిగుడు అవుతున్నంత కాలం లాభంలేదు. ఒకేసారి వరుసగా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, ఒకేసారి తెగి సహస్రారంలోకి వెళ్ళడం ఇందులో చూపిస్తున్నారు. స్థూల సూక్ష్మ కారణ బంధములు మూడూ తెగి మోక్షాన్ని చూపిస్తున్నారిక్కడ. ఒక్క స్థూలం తెగితే మిగిలిన సూక్ష్మ కారణాలుంటాయి. సూక్ష్మం తెగితే కారణమ్ మిగిలి వుంటుంది. మూడూ తెగితేనే త్రిపురాసుర సంహారం. అప్పుడే మోక్షం. మూడూ ఒక్కసారి తెగడం సామాన్యమా? అప్పుడు అమ్మవారు అన్నారు "అబ్బాయిని మర్చిపోయారు" అని. ఒట్టి అబ్బాయి కాదు, మనిద్దరి ఏకస్వరూపం, మనిద్దరై వున్నవాడు, మనమెంత అనాదో ఆయనంత అనాది. మనమెంత పరబ్రహ్మ స్వరూపమే ఆయనంత పరబ్రహ్మ స్వరూపం. గణపతిని ఆరాధించాలి. ఆయన ఆరాధన లేనప్పుడు సృష్టిలో యే ఒక్కడూ యేదీ సాధించలేరు. అని చెప్పగానే వెంటనే ధ్యానానికి కూర్చున్నాడట. అయిదు ముఖాలతో ధ్యానిస్తూ వున్నాడట చాలాసేపు గణపతి రూపాన్ని. ఆ సమయంలో ఆయన అయిదు ముఖాలలోనుంచి ఒక మహామూర్తి ఆయన ఎదురుగా వచ్చిందిట. ఆ వస్తున్నప్పుడు మహా ప్రణవనాదం ధ్వని చేస్తూ వచ్చింది. గణపతి అంటేనే ధ్వని స్వరూపం. గణపతి రెండు నామములు ధ్వని స్వరూపుడని చెప్తాయి - హేరంబ, డుంఢి. డుంఢి అంటే అద్భుతమైన ధ్వని చేయువాడు అని అర్థం. డుంఢిరాజు అని ప్రత్యేకమైన పేరున్నది. ప్రణవ స్వరూపం. మహానాదంతో రాగానే ఆ నాదానికి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు శివుడు. ఎదురుగా అయిదు ముఖాల గణపతి కనపడ్డాడుట.
"పంచవక్త్రో దశభుజో లలాటేందుః శశిప్రభః" - ఆపైన చంద్రలేఖ వున్నది. తెల్లగా మెరిసిపోతున్నాడు. నాన్నపోలిక. భండాసుర సంహారం చేసినప్పుడు అరుణ స్వరూపం, అమ్మపోలిక. "వినాయకం పంచముఖం పంచాస్య మపరం శివం" అయిదు ముఖాల గణపతిని చూసి ఏమిటీ నేనే రెండైపోయానా? అనుకున్నాడట. లేక గజాననుడు నాకు వరమివ్వడానికి ఈరూపంలో వచ్చాడా? నిరంతరం పగలూ రాత్రీ యే గణపతిని ధ్యానిస్తున్నానో ఆ గణపతి నాకు వరమివ్వడానికి ఇలా వచ్చాడా? ఇక్కడ గణపతిని ఉద్దేశించి శివుడు చేసిన గణపతి సహస్రనామ స్తోత్రమే చాలా ప్రసిద్ధిగా దొరుకుతున్నది. గణేశ్వరో గణక్రీడో ఇత్యాది నామాలతో వస్తున్నటువంటి గణపతి సహస్రం. ఇది గణపతే శివుడికి స్ఫురింపజేస్తే శివుడు చేసిన గణపతి సహస్రం. అది అయిన తర్వాత నీకేం ఫరవాలేదు వెళ్ళు అన్నాడట. ఎప్పుడైతే ఈయన ధనుస్సును ఎక్కుపెట్టాడో నానా తిక్క వేషాలు వేస్తూ అడ్డదిడ్డంగా వున్న వాళ్ళని ఒక్కసారి తన తొండం చాపి ముగ్గురినీ Straight గా నిలబెట్టాడట. అటుఇటు తిప్పుకోలేక గింజుకుంటున్నారు వాళ్ళు. అంతేకాక గణపతి బీజాక్షరాన్ని బాణంపై ఆవాహన చేయమన్నాడు. బీజాన్ని ఆవాహన చేసి కొట్టగానే అది తిన్నగా వెళ్ళి మూడు పట్టణాలనూ ఏక కాలంలో ధ్వంసం చేసింది. దానితో త్రిపురాసుర సంహారం చేశాడు పరమేశ్వరుడు. కనుక విజయం ఎవరిది? గణపతిది. ఈవిషయం సాక్షాత్తు శివుడే చెప్పాడు.




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML