What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 11 June 2014

అల్లూరి జయంతిని పట్టించుకోని ప్రభుత్వం

అల్లూరి జయంతిని పట్టించుకోని ప్రభుత్వం
బ్రిటిష్‌ వారి తుపాకీకి ఎదురునిలిచి.. దమ్ముంటే కాల్చరా అంటూ సవాల్‌ విసిరిన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు. విల్లుంబులతో.. తెల్లవారిని తోకముడిచేలా చేసిన ఆ యోధుడు.. తెలుగుజాతి మగధీరుడు. ఇవాళ అల్లూరి 115వ జయంతి. అయితే, అల్లూరి జయంతిని సర్కారు అధికారికంగా నిర్వహించకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. తెలుగువారిని మేల్కొలిపి.. దీక్షబూని సాగేలా చేసిన స్వాతంత్ర్యసమరయోధుడు అల్లూరి.

భరతమాతను చెరబట్టిన తెల్లవారిని దేశం నుంచి తరిమేయడానికి సాయుధమార్గమే శరణ్యమని.. విప్లవబాటన పయనించాడు సీతారామరాజు. అడవుల్లో పుట్టకొకరు.. చెట్టుకొకరు ఉన్న గిరిజనులను ఏకం చేసి.. బ్రిటిష్‌ వారిపైకి బాణాలను ఎక్కుపెట్టారు. వరుసగా పోలీస్‌ స్టేషన్లపై దాడులు చేస్తూ.. ఆంగ్లేయులను అదరగొట్టారు. విశాఖ మన్యంలో అల్లూరి చేపట్టిన విప్లవ సంగ్రామంపై.. అప్పట్లో బ్రిటిష్‌ పార్లమెంట్‌లో 15నిమిషాల పాటు చర్చ జరిగిందంటే.. సీతారామరాజు సాయుధపోరాటం బ్రిటిష్‌వారిని ఏ రేంజ్‌లో భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.

మన్యంలో ఎన్నో విజయాలు సాధించిన అల్లూరి.. చివరకు ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో తెల్లవారికి బందీగాచిక్కి.. తుపాకీ గుండ్లకు బలయ్యాడు. ఆయన పోరాటం.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చిరస్మరణీయం. విశాఖ జిల్లా పాండ్రంగిలో 1897 జులై 4న జన్మించిన అల్లూరి.. 115వ జయంతి నేడు. తెలుగుజాతిని విశేషంగా ప్రభావితం చేసిన సీతారామరాజు జయంతి వేడుకలను అధికారికంగా జరపాలన్న ధ్యాసే సర్కారుకు కలగడం లేదు.

పంపా, కృష్ణదేవిపేటలో ఉన్న.. అల్లూరి స్మారక కేంద్రాలు.. నిర్లక్ష్యానికి నిలువుటద్దాలు. విశాఖ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలని స్థానికులు ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు.అల్లూరి జయంతిని సర్కారు పట్టించుకోకపోయినా.. ఆయన అభిమానులు.. ప్రజలు కొన్ని దశాబ్దాలుగా సీతారామరాజు జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి సమాధి వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా పూనుకుని.. సీతారామరాజు జయంతిని అధికారికంగా చేపడితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
- TV5 news

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML