What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 17 June 2014

పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో అంత ఆర్ద్ర స్వరూపుడు.

పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో అంత ఆర్ద్ర స్వరూపుడు. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఉన్నాయి. బాగా బాధపడితే ఎండిపోతే గ్లాసుడు నీళ్ళు త్రాగండి. ఎంత శాంతినిస్తుందో. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుడిని ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుడిలో రెండు స్వరూపాలున్నాయి. దీనినే లలితా సహస్రంలో "చిదేకరసరూపిణి" అని చెప్పారు. కేవల జ్ఞానంతో వున్న ఆనంద స్వరూపిణి. జ్ఞానం, ఆనందం అదే శివుడు జ్యోతస్ఫాటిక లింగం అనడం "మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః" అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ధృవపదం - ధృవుడాయన. అచలం శాశ్వతం ధృవం - శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ మనం చూస్తున్నవి అన్నీ విశ్వంలో వెనకాల మారనివాడొకడున్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా వున్నదో ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నింటిలో బ్రహ్మము వ్యాపించి వున్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధృవమై వున్నాడు. అలలు మారిపోతున్నాయి. సముద్రం మారుతోందా? ఇప్పుడు కనపడిన అల కాసేపటికి కనపడదు. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతోంది? ఇలాంటి అలల లాంటి వాళ్ళం మనం. మనమే కాదు కనిపించే ప్రతిదీ. ప్రతి అలలో సముద్రం వ్యాపించియున్నట్లుగా ప్రతి భువనంలో వ్యాపిమ్చియున్నాడు ఈ మహా సముద్ర దర్శనమే శివలింగ ధ్యానశ్లోకంలో వుంది. ఇప్పుడు చెప్పండి భారతీయుల పూజావిధానాలు కేవలం నమ్మకాలా? విశ్వాసాలా? కాదు విజ్ఞానాలు. విశ్వాన్నంతటినీ ఏక చైతన్యంగా చూడగలిగే మహా విజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనలలోనే పెట్టుకున్నామే ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవరో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవరు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్నే కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకరు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇంత విశిష్టమైన భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML