హనుమంతుడికి తమలపాకులతో పూజలు చేస్తే అనంతమైన పుణ్యఫలం
హనుమంతుడు అనేక అవతారాలు ధరించాడు. అందులో సుప్రసిద్ధమైనవి తొమ్మిది. వీటిలో సువర్చలాహనుమంతుడి అవతారం కూడా ఒకటి. చైత్రమాసంలో పుష్యమీ నక్షత్రం ఉన్నరోజున; వైశాఖంలో ఆశ్లేషా నక్షత్రం రోజున, కృష్ణపక్ష దశమినాడు; జ్యేష్టమాసంలో మఖా నక్షత్రం రోజున, శుద్ధ విదియ, దశమిరోజుల్లో; ఆషాఢంలో రోహిణీ నక్షత్రంనాడు; శ్రావణంలో పౌర్ణమినాడు; భాద్రపదంలో అశ్వినీ నక్షత్రం ఉన్న రోజున; ఆశ్వయుజమాసంలో మృగశిరానక్షత్రం నాడు; కార్తీకంలో శుక్లపక్ష ద్వాదశినాడు; మార్గశిరంలో శుద్ధత్రయోదశినాడు; పుష్యంలో ఉత్తరా నక్షత్రం ఉన్న రోజున; మాఘంలో ఆర్ద్రా నక్షత్రం రోజున; ఫాల్గుణంలో పునర్వసు నక్షత్రం ఉన్నరోజున సువర్చలాంజనేయస్వామికి తమలపాకులతోనూ సింధూరంతోనూ పూజలు చేస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుందట.

No comments:
Post a Comment