యజ్ఞోపవీతం గురించి ప్రస్తావన వేదాలలో లేదని, తరువాతి కాలాలలో వచ్చిందని ఒకచోట చదివాను. అది నిజమేనా?
వేద సూక్తాలలో చెప్పిన వాటిని ఆధారం చేసుకొని శిక్ష, వ్యాకరణ, ఛంద, నిర్క్త, జ్యోతిష, కల్పాలు అనే షడంగాలు ఆవిర్భవించాయి. అందులో "కల్పం"లో చాలా విషయాలు చెప్పబడ్డాయి. వాటిని ఆధారం చేసుకొని భారతీయ ధర్మాలు ఆవిర్భవించాయి.
అయినా వేదాలలో కూడా - "పుష్టాయ ఉపవీతినే నమః" అని ఒకచోట, "యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్" అని మరొకచోట ఇలా మంత్రాలు కనిపిస్తాయి. సమగ్ర పరిశీలన లేకుండా వ్రాసిన వ్రాతల వల్ల మన ఆచారవ్యవహారాల పట్ల అవగాహన కోల్పోతున్నాం.
వేదాలు మూలంగా విస్తరించిన సంస్కృతిలో ఎన్నో ఉత్తమాంశాలను మహాత్ములు ఆవిష్కరించి నిబద్ధం చేస్తారు. అవి ’వేదాల్లో లేవు’ అని అరకొర అవగాహనతో అంటూ ఉంటే చివరికి ఏమీ మిగలని స్థితి వస్తుంది.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment