What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 11 June 2014

గంగావతరణం జరిగినరోజు :: జ్యేష్ఠశుద్ధ ద్వాదశి ------- జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి - గంగావతరణం:

రేపు జ్యేష్ఠశుద్ధ ద్వాదశి. గంగావతరణం జరిగినరోజు. ఈరోజు సమీప నదిలో గంగాస్మరణతో స్నానం చేయాలి. నది లభ్యం కానప్పుడు వాపీకూప తటాకాదులు వేటిలోనైనా, లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా నామస్మరణ చేయాలి.
నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా!
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ!!
భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే!
స్నానకాలే పఠేన్నిత్యం మహాపాత నాశనమ్!!

ఈ పన్నెండు నామాలతో గంగను స్మరించితే పాప హరణం.
గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానామ్ శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి!!
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలం!
స్వర్గారోహణ సోపానే మహాపుణ్య తరంగిణి!!
విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవమ్
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్!!
అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమ
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి!!
త్వం రాజా సర్వ తీర్థానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహి మే తీర్థం సర్వ పాపాపనుత్తయే!!
యోsసౌ సర్వగతో విష్ణుః చిత్స్వరూపీ జనార్దనః
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః!!


దుర్దశలను పోగొట్టగలిగే శక్తి గల తిథి ఇది. ఈ రోజున గంగాదేవి అవతరించిన తిథి. (వైశాఖ శుద్ధ సప్తమి గంగ దేవతగా పుట్టిన తిథి. ఈ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి భగీరథుని తపః ఫలంగా గంగమ్మ అవతరించిందీ తిథి). ఈరోజున కాశీలో ఉంటే దశాశ్వమేథ తీర్థంలో స్నానం చేసి గంగాపూజ చేయాలి.
ఇతరత్రా ప్రాంతాలలో ఉన్నవారు సమీప నదిలో గంగాస్మరణతో స్నానం చేయాలి. నది లభ్యం కానప్పుడు వాపీకూప తటాకాదులు వేటిలోనైనా, లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా నామస్మరణ చేయాలి.
నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథగామినీ
భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ...
ఈ పన్నెండు నామాలతో గంగను స్మరించితే పాప హరణం, పవిత్రీకరణం, స్నానాంతరం శుద్ధ వస్త్రధారణ చేసి ఒక కలశాన గంగను ఉంచి, మకరవాహిని, కలశ పద్మధారిణి అయిన గంగాంబను ధ్యానించి షోడశోపచార పూజ చేయాలి.
నమో భగవత్యైః దశాపాపహరాయై గంగాయి నారాయణ్యై రేవత్యై
శివాయై దక్షాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే నమోనమః!!
అనే మంత్రాన్ని పఠించి నమస్కరించాలి. ఈ ద్వాదశిని 'రామలక్ష్మణ ద్వాదశి' అని కూడా అంటారు.



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML