అమరకోశంలో అమరసింహుడు ఆయనను 'పరమానంద రూపత్వ' అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయటవున్న వస్తువులలో లేదు. లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో వుంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే 'శివ'. ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలోతాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు.
మనం అందరం కూడ కదులుతున్న తరంగములతో కూడిన సరోవరములలాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మనుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదానివెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడ హేతువులు అవుతుంటాయి. ఇటువండి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలోనుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు 'శివ' అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యదైవము.

No comments:
Post a Comment