What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 6 October 2014

సాంబ సదా శివ అని ప్రార్థిద్దాము

అద్భుతమైన విగ్రహము కలవాడు,
దేవతలకు అధిపతి,
ఎన్న లేని గుణముల సమూహం కలవాడు,
ఆశ్రితులను రక్షించి ఆనందమనే అమృతాన్ని ఇచ్చే వాడు,
ఆత్మానంద స్వరూపుడు, మహేశ్వరుడు,
చంద్రుని ధరించిన వాడు,
ఇంద్రాది దేవతలకు ప్రియుడు,
సుందరమైన రూపము కలవాడు,
దేవతలకు అధిపతి, ఈశ్వరుడు,
జనులకు ప్రియుడు,
విష్ణువుచే పొగడ బడిన వాడు,
కీర్తి కలవాడు అయిన శివుని
సాంబ సదా శివ అని ప్రార్థిద్దాము
నాగ జాతికి ప్రియుడైన వాడు,
సర్పములను ఆభరణములుగా కలవాడు,
నరక బాధ నాశనము చేసే వాడు,
నాట్యానికి ఈశ్వరుడు,
దుష్టులైన దానవులను నాశనము చేసే వాడు,
జన్మము, జరా మరణములను నాశనము చేసే వాడు,
కల్మషము లేని వాడు, కాశీ నివాసుడు,
ఝుంకారము అంటే ఇష్ట పడే వాడు,
భృంగి (నంది) నాట్య మంటే ఇష్టపడే వాడు,
ఓంకారేశ్వర క్షేత్రములో వెలసిల్లిన వాడు,
జ్ఞానమును కలిగించే వాడు,
ఆజ్ఞానమును నాశనము చేసే వాడు,
నిర్మలమైన వాడు, టంక స్వరూపుడు,
ఢక్కము మొదలగు ఆయుధములు కలిగి,
దేవతా గణము చే పూజించబడి,
లావణ్యముతో శోభిల్లే వాడు అయిన శివుని
సాంబ సదా శివ అని ప్రార్థిద్దాము


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML