What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 19 October 2014

ఉదాత్త జీవనం - ఉన్నత ఆదర్శం!

ఉదాత్త జీవనం - ఉన్నత ఆదర్శం!

పాశ్చాత్య సంస్కృతీ నాగరికతలను అనుకరిస్తూ క్షణికమైన ఆనందం కోసం పరుగులు పెట్టడం మాని, ఒక ఉన్నతమైన ఆదర్శం కలిగి ఉండాలి. అది ఏమిటంటే - నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపడం. సంపాదనే ఉన్నత ఆశయం కాదు. జీవన ప్రమాణాలు పెంచుకోవడం కాదు, అవసరాలకు తగ్గట్లు జీవిస్తూ ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. అప్పుడే మనశ్శాంతి కలిగేది. జీవన నాణ్యతను పెంచుకొని, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. వారాంతంలో విచ్చలవిడి విందు వినోదాలను వీడి, కుటుంబంలోని పిల్లలు, పెద్దలనూ, వృద్ధులను ప్రేమగా పలకరిస్తూ, వారికోసం కొంత సమయాన్ని కేటాయించాలి. సమాజంలో హుందాగా జీవించడం ఉన్నత జీవనం కాదు. మనకున్న శీలసంపద, ఆలోచనలే మన జీవన సరళిని నిర్ణయిస్తాయి. 'మన ఆలోచనలే మనాలి గొప్ప వాళ్ళను చేస్తాయి' అంటారు స్వామి వివేకానంద. 'ఆటపాటల్లో, వేషభాషలలో, సుఖదుఃఖాలలో, అన్ని దైనందిన కార్యాలలో నీతి తప్పని ధీరులై జీవించండి.అలాంటి ఆదర్శంతో జీవితాన్ని మలచుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు' అంటారు స్వామి వివేకానంద.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML