What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 11 October 2014

మూషకం: ఎలుక గోడలలోనూ నేలలోనూ కలుగుల్లో నివసించే స్వభావం కలది కదా!

మూషకం: ఎలుక గోడలలోనూ నేలలోనూ కలుగుల్లో నివసించే స్వభావం కలది కదా! ఒక చిన్న రంధ్రంద్వారా ప్రవేశిమ్చి ఎంత పెద్ద చిరాకునైనా కల్పించగలుగుతుంది. వైశయికలాలస కూడ ఎలుకలాంటిదే. ఎంత చిన్నగా అవకాశం ఇచ్చినా లోపల ప్రవేశించినతర్వాత ఇంతేలే...ఇంతే కదా.. అంటూ వ్యాప్తి నందుకుంటుంది. ఈ భావాన్నే హెచ్చరిస్తూ దాన్ని వాహనంగా స్వాధీనం చేసుకున్నాడు గణపతి. దక్షిణామూర్తి పాదం క్రింద అపస్మారరాక్షసునిలాననుకోండి! ఏ బలహీనతకైనా ఎంత చిన్న అవకాశం ఇచ్చినా అది లోపలికి వెళ్ళి వ్యసన వికాసం కలిగించి సాధనాలై ముఖ్యామహాసామ్రాజ్యాన్ని స్థాపించి కూర్చుంటుంది జాగ్రత్త, ఇదే దాని సంకేతం.
నాలుగు చేతులు: గణేశ్వరుని నాలుగు చేతులూ ౧. మనస్సు ౨. బుద్ధి ౩. చిత్తము ౪. అహంకారము - అనేవాటికి సంకేతాలు. ఈ నాల్గింటికీ మూలమైన శుద్ధ చైతన్యమే గణపతి వ్యక్తిత్వము. వ్యక్తిత్వంలోని ప్రతిభాంతర్గత క్రియాశక్తి చేతికి సంకేతం. కర్తరి ప్రయోగాత్మక క్రియాశక్తి దక్షహస్తాత్మకమైతే కర్మి ప్రయోగాత్మక క్రియాశక్తి వామహస్తాత్మకమౌతుంది. సర్వవ్యాపక-సర్వసమర్థ బ్రహ్మతత్త్వాన్ని చూపిస్తున్నాయా అనేట్లు ఆ నాలుగు చేతుల దిశ సూచిస్తుంది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML