What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 14 October 2014

హనుమ దాటిన సముద్రం లవణసముద్రం.

స సాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం
నిపత్య తీరే చ మహోదధే స్తదా దదర్శలంకాం అమరావతీమివ
హనుమ దాటిన సముద్రం లవణసముద్రం.అందులో రాక్షసులు ఉన్నారు. పాములు ఉన్నాయి. అటువంటి సముద్రమునుదాటి కాంచనలంకలోప్రవేశించి అమరావతివలె ఒప్పుతున్న లంకానగరమును కాంచాడు. నగరంలోనికి పిల్లివలె ప్రవేశించాలని భావించాడు.
పిల్లి నడుస్తున్నప్పుడు శబ్దం అవదు. పిల్లి ఎప్పుడు పడుకుంటుందో, ఎప్పుడు తిరుగుతుందో, ఉంటుందో నిర్ధారణగా చెప్పలేరు. యోగి అయినవాని పరిస్థితి ఇంతె. యోగి ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు తెలివిగా ఉంటాడో ,ఎప్పుడు ధ్యానంచేస్తాడో,దానికి వేళాపాళాకాని, స్నానంచేశాడా అని కాని ఏమి ఉండవు. అన్నిటికీఅతీతమయిన స్థితిలో ఉంటాడు.అందుకే ఙ్ఞానిని మీరు అనుకరించలేరు.సర్వకాలములయందు బ్రహ్మముతో రమిస్తూ ఉంటాడు. అది మహానుభావుడి తత్త్వం. అందుచేత యోగి స్థితిని నిరూపించడంకోసం హనుమ పిల్లిపిల్లవలె వెళ్ళాడు అన్నాడు మహర్షి. అంతే కాని పిల్లి కన్నా చిన్నది లేదనికాదు ప్రపంచంలో. పిల్లిపిల్లంత స్వరూపమును పొందినవాడై లంక రాజద్వారం దగ్గరకి వెళ్ళాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML