
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 14 October 2014
కర్ణుని గొప్పతనం...!
కర్ణుని గొప్పతనం...!
మహాభారత యుద్ధం ప్రారంభం అయ్యింది. కర్ణార్జున మధ్య ఘోర యుద్ధం జరుగుతోంది.
ఒక దశలో కర్ణుడు నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. అభేద్యమైన ఆ బాణం అర్జునుని శిరస్సును ఖండించేదే....కానీ ఇది గ్రహించిన కృష్ణుడు అర్జునుని రథాన్ని బలంగా క్రిందికి తొక్కడం వల్ల నాగాస్త్రం అర్జునుని శిరస్సుకి అరా అంగుళం మీదుగా పోయి వ్యర్ధం అయ్యింది.
నాగాస్త్రం అదే వేగంతో తిరిగి కర్ణుని వద్దకు వచ్చి, '' కర్ణా కృష్ణ మాయ వలన నా గురి వెంట్రుక వాసిలో తప్పినది, రెండవసారి నన్ను ప్రయోగించు ఈ సారి కృష్ణుడే కాదు త్రిమూర్తులు వచ్చినా అర్జునుని శిరస్సు ఖండించి తీరుతాను. నీకు విజయం అందిస్తాను. '' అని కోరింది.
బదులుగా కర్ణుడు '' నాగాస్త్రమా....నన్ను మన్నించు, ఒకసారి ప్రయోగించిన బాణాన్ని ఎత్తి పరిస్థితిలో తిరిగి ప్రయోగించను , అదే యుద్ధ ధర్మం. దయచేసి నిష్క్రమించు.'' అని ప్రార్థించాడు.
ప్రాణాపాయ స్థితిలో కూడా యుద్ధ ధర్మం పాటించే కర్ణుని దీవిన్చి నాగాస్త్రం మాయమైనది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment