స్వశక్తి - దైవభక్తి
జీవితంలో ఒడుదుడుకులనేవి సహజం. అవి లేకపోతే జీవితానికి అందం లేదు. వాటికి భయపడకండి. ప్రయత్నం గురించి ఆలోచించండి. లేచి నిలబడండి. బలవంతులుగా ఉండండి. నా విధికి నేనే కర్తను అన్న వాక్యాన్ని పదేపదే స్మరించండి. 'ఇప్పటివరకు హుందాగా జీవించాను, ఏమిటి ఇప్పటి దుస్థితి. మా జీవితాలలో మళ్ళీ స్థిరపడతామా' అన్న నిరాశతో కూడిన ఆలోచన విడిచిపెట్టండి.
'విశ్వాసం...మీమీద మీకు విశ్వాసం! తరువాత భగవంతుని మీద విశ్వాసం. అదే విజయ రహస్యం' అంటారు స్వామి వివేకానంద చిన్నా పెద్దా అంటూ పనిలో తేడాలు చూడకుండా ఏ పని చేయడానికైనా ముందంజ వేయండి. ప్రపంచ చరిత్రలో మహాత్ములను పరిశీలిస్తే, వాళ్ళు కూడా దుఃఖాలు, బాధలనుంచే పాఠాలను నేర్చుకున్నారన్న విషయం తెలుస్తుంది.
ప్రతిరోజూ లేదంటే కనీసం వారాంతంలోనైనా సరే దేవాలయాలకు వెళ్లి మీకోసం, అందరికోసం ప్రార్థించండి. అక్కడ జరిగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనండి. 'ఆధ్యాత్మికతను విడిచి పాశ్చాత్యుల నాగరికతను అనుసరిస్తే జాతి వినాశనం చెందుతుంది. ఈ జాతీయ భవంతి పునాదులు కదిలిపోయి, జాతి సర్వ నాశనమవుతుంది' అంటారు స్వామి వివేకానంద.

No comments:
Post a Comment